ఇటీవల ఓ రిక్షావాలా తన కూతురి తన స్థాయికి తగినట్లుగా వివాహం జరిపించాడు. అయితే... ఆ పెళ్లికి ప్రధాని నరేంద్రమోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా... ఆ రిక్షావాలాను తాజాగా ప్రధాని మోదీ కలిశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసికి సమీపంలోని దొమ్రి గ్రామానికి చెందిన మంగళ్ కేవాత్ రిక్షా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
జీవితాంతం రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో తన కూతురికి వివాహం చేయడానికి నిర్ణయించాడు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుంటూనే, బంధువులు, మిత్రులను పెళ్లికి ఆహ్వానించాడు.

అదే సమయంలో తన కుమార్తె పెళ్లికి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించాడు. ఫిబ్రవరి 12న జరగనున్న తన బిడ్డ పెళ్లికి వచ్చి ఆమెను ఆశీర్వాదించాలంటూ ఓ లేఖ కూడా రాశాడు. దీనిపై స్పందించిన ప్రధాని నరేంద్రమోదీ కేవత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ మరో లేఖ రాశారు.

Also Read కూతురి పెళ్లికి ప్రధానిని ఆహ్వానించిన రిక్షావాలా, స్పందించిన మోడీ

జీవితాంతం సుఖసంతోషాలతో జీవించాలంటూ కేవత్ కుమార్తెను ఆశీర్వదించారు. తన అభిమాన నేత మోదీ నుంచి లేఖ రావడంతో కేవత్ ఆనందంలో ఉబ్బితబ్బిబ్బైపపోతున్నాడు.

తన కుమార్తె పెళ్లికి రావాల్సిందిగా ఒకటి ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి, రెండోది వారణాసిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి రెండు శుభలేఖలు పంపినట్లు కేవత్ తెలిపాడు. తనకు ఆయన నుంచి ప్రత్యుత్తరం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మోదీ నుంచి వచ్చిన లేఖను బంధు మిత్రులందరికీ చూపించిన కేవత్.. ఆ లేఖను జీవితాంతం దాచుకుంటానని చెప్పాడు. 

నాడు లేఖ రాసిన మోదీ.. తాజాగా ఏకంగా రిక్షావాలను కలిశారు. కేవాత్, ఆయన భార్య రేణు దేవి లు మోదీని కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.