పీఎం కేర్స్ - ప్రైమ్ మినిస్టర్ సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్ నిధులనుండి తొలిసారిగా నిధులను ఈ కరోనా వైరస్ పై పోరుకు వెచ్చించనున్నారు. 3100 కోట్లను కరోనా పై పోరుకు ఈ నిధి నుంచి వెచ్చించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. 

ఈ 3100 కోట్లలో 2000 కోట్ల రూపాయలు వెంటిలేటర్ల కొనుగోలుకు, 1000 కోట్లు వలస కూలీలా కోసం ఖర్చు చేయనుండగా, మరో 100 కోట్లు ఈ కరోనా వాక్సిన్ అభివృద్ధికి కేటాయించనున్నట్టు ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

ఈ పీఎం కేర్స్ ట్రస్ట్ మార్చ్ 27వ తేదీన ప్రధాని అధ్యక్షతన ఏర్పడింది. ఇందులో రక్షణశాఖ మంత్రి, హోమ్ మంత్రి, ఆర్ధిక శాఖామంత్రి ఇతర ఎక్స్ అఫీషియో మెంబర్లుగా ఉంటారు. 

ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుండి ఈ కరోనా మహమ్మారిపై పోరాడేందుకు నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి సహాయ నిధి ఉన్నప్పటికీ.... ట్రస్ట్ రూపంలో ఈ పీఎం కేర్స్ ను ఏర్పాటు చేసింది. 

ఇకపోతే.... 2019-20 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి ఈ ఏడాది నవంబర్ 30వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

బుధవారం నాడు న్యూఢిల్లీలో ఆమె మీడియాతో మాట్లాడారు. చారిటబుల్ ట్రస్టులు,స్వచ్చంధ సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీ ఫండ్స్ సత్వరమే చెల్లించనున్నట్టుగా కేంద్రం తెలిపింది.

టీడీఎస్ రేట్లను 25 శాతం తగ్గించారు. వడ్డీ, అద్దె, బ్రోకరేజ్, సరఫరా తదితర మొదలైన అన్ని రకాల చెల్లింపులపై ఇది వర్తిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది.  ఇది రేపటి నుండి వచ్చే ఏడాది మార్చి 31వరకు ఇది అమల్లో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. తద్వారా సుమారు రూ. 50 వేల కోట్లు ప్రజలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.

2019-20 ఆర్ధిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్  దాఖలుకు జూలై 30 వ తేదీ నుండి అక్టోబర్ 30వ తేదీ వరకు గతంలో గడువు పెంచారు. ఈ గడువును ఇవాళ నవంబర్ 30వ  తేదీకి పొడిగించారు.  టాక్స్ ఆడిట్స్ ను గడువును సెప్టెంబర్ 30వ తేదీ నుండి అక్టోబర్ 31వరకు పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి తెలిపారు.  డేట్ ఆఫ్ అసెస్ మెంట్ కు మూడు మాసాల పాటు గడువును పెంచింది. 

సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు పొడిగించింది. మార్చి 2021 వరకు గడవు ముగిసిన వారికి వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు గడువును  పొడిగిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి అదనపు పన్నులు ఉండవని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా  సీతారామన్ తెలిపారు.