కాలేజీకి వెళ్లే అమ్మాయిలు, పాఠాలు చెప్పే లెక్చరర్ల ఫోటోలను కొందరు యువకులు పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశారు. కాగా.. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితులు ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకి చెందిన ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో కాలేజీ అమ్మాయిల ఫోటోలు డౌన్ లోడ్ చేసి వాటిని పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేశారు. కాగా.. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కాగా.. నిందితులు సీవీ రామన్‌నగర్‌కు చెందిన అజయ్ థనికాచలం(37), మరొకరు రాజయ్యనగర్‌కు చెందిన వికాస్‌ రఘోత్తమ్‌ ‌(27)గా గుర్తించారు. నిందితుల్లో ఒకరైన అజయ్‌ ఇంజనీర్‌ కాగా.. మరో నిందితుడు విశ్వక్‌సేన్‌ బాధిత విద్యార్థినుల బ్యాచ్‌మేట్‌ అని తెలుస్తోంది.

ఈజీ మనీకి అలవాటు పడి తన స్నేహితుల ఫోటోలను పోర్న్‌సైట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే తమ ఫొటోలు పోర్న్సైట్‌లో అప్‌లోడ్ అయ్యాయని గుర్తించిన విద్యార్థినులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 30 వరకు ఫొటోలు అప్ లోడ్ చేసినట్టు గుర్తించారు. వెంటనే సదురు సైట్లకు మెయిల్ చేసి వాటిని తొలగించేలా చర్యలు తీసుకున్నారు. నిందితుల మొబైల్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.