న్యూఢిల్లీ: భారత భూభాగంలోకి  పాక్ యుద్ధ విమానాలు చొరబడ్డాయి. రాజౌరీ సెక్టార్‌లో ఈ యుద్ధ విమానాలు చొచ్చుకువచ్చినట్టుగా భారత రక్షణ శాఖా ధికారులు చెబుతున్నారు. పాక్ విమానాలను భారత వైమానిక దళాలు  వెనక్కు పంపించాయి.

బుధవారం నాడు పాక్‌కు చెందిన యుద్ధ విమానాలను గుర్తించిన భారత వైమానిక దళం పాక్ విమానాలపై ఎదురు దాడికి పాల్పడింది. దీంతో పాక్ యుద్ధ విమానాలు వెనక్కు వెళ్లాయి.

 పాక్ భూభాగంలోని బాలాకోట్‌లో గల జైషే మహ్మాద్ ఉగ్రవాద శిబిరాలపై భారత్  సర్జికల్ స్ట్రైక్స్‌తో పాక్ ఈ కవ్వింపు చర్యలకు దిగినట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు.