Asianet News TeluguAsianet News Telugu

Drugs: గుజరాత్‌లో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ సీజ్.. పాకిస్తాన్ నుంచే రవాణా?.. కశ్మీర్‌లోనూ బెడద

దేశంలో డ్రగ్స్ పట్టుబడుతున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో సుమారు 3 వేల కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడి దేశంలో కలకలం రేపింది. తాజాగా నవలాఖి పోర్టులో సమీపంలోని ఓ గ్రామంలో 120 కేజీలో డ్రగ్స్ అంటే సుమారు రూ. 600 కోట్ల విలువ చేసే మాదక ద్రవ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇది పాకిస్తాన్ కుట్రేనని, ఆ దేశమే మన దేశంలోకి డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు, జమ్ము కశ్మీర్‌లోనూ పాకిస్తాన్ పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను పంపి యువతను నిర్వీర్యం చేస్తున్నదని జమ్ము కశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ అన్నారు.
 

pakistan pushing drugs into india.. 120 kg drugs seized in gujarat
Author
New Delhi, First Published Nov 15, 2021, 12:53 PM IST

అహ్మదాబాద్: Afghanistanలో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మన దేశంలో పెద్ద మొత్తంలో Drugs పట్టుబడుతున్నది. అధికారంలోకి రాకముందు Talibans డ్రగ్స్‌పైనే ఎక్కువ ఆధారపడి ఆర్థిక అవసరాలను తీర్చుకునే విషయం తెలిసిందే. ఆఫ్ఘనిస్తాన్‌లో ఓపియమ్ ఎక్కువగా లభిస్తుంది. తాలిబాన్లు ఎక్కువగా దీనిపైనే ఆధారపడేవారు. గుజరాత్‌లో ముంద్ర పోర్టులో పట్టుబడ్డు సుమారు మూడు వేల కిలోల మాదక ద్రవ్యాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే రాష్ట్రంలో మరోసారి డ్రగ్స్ పట్టుబడింది. ఈ సారి కచ్‌కు దగ్గరగా ఉండే నవలాఖి పోర్టు సమీపంలోని ఓ గ్రామంలో బయటపడింది. మోర్బిలోని జింజుదా గ్రామంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు 600 కోట్ల విలువైన డ్రగ్స్ వెలుగు చూసింది. దాదాపు 120 కేజీల డ్రగ్స్‌ను Seize చేసినట్టు రాష్ట్ర హోం శాఖ మంత్రి హర్ష్ సాంఘ్వి వెల్లడించారు.

మరో ఆందోళనకర విషయమేమిటంటే.. ఈ డ్రగ్స్ పాకిస్తాన్ నుంచి వచ్చినట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి. Pakistan నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ మహారాష్ట్ర, గోవాలకు పంపే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని, ఇందులో భాగంగానే గుజరాత్‌కూ ఈ మాదక ద్రవ్యాలు వచ్చి చేరాయనేది ఆ కథనాల సారాంశం.

Also Read: గుజరాత్ పోర్టులో భారీగా హెరాయిన్ పట్టివేత.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన రూ. 9వేల కోట్ల డ్రగ్స్ సీజ్!

గుజరాత్ హోం మంత్రి హర్ష్ సాంఘ్వి ఈ రోజు ట్విట్టర్‌లో తాజా డ్రగ్స్ స్వాధీనం గురించి ప్రకటన చేశారు. గుజరాత్ పోలీసులు మరో విజయాన్ని సాధించారని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్‌ మహమ్మారిని అంతమొందించడానికి గుజరాత్ పోలీసులు ముందుండి పోరాడుతున్నారని వివరించారు. గుజరాత్ ఏటీఎస్ సుమారు 120 కేజీల డ్రగ్స్‌ను పట్టుకున్నట్టు తెలిపారు.

Also Read: గుజరాత్ డ్రగ్స్ కేసు: చెన్నైలో ఎన్ఐఏ సోదాలు.. ఏపీ దంపతుల అరెస్ట్

దీనికితోడు మరో కలకలం రేపే విశ్లేషణ కూడా ఒకటి బయటకు వచ్చింది. జమ్ము కశ్మీర్‌లోనూ పాకిస్తాన్ ఇలాంటి కుట్రపూరిత ఎత్తుగడనే వేస్తున్నట్టు తెలుస్తున్నది. జమ్ము కశ్మీర్‌లో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పెరిగిందని స్వయంగా జమ్ము కశ్మీర్ పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ వివరించారు. కశ్మీరీ యువతే లక్ష్యంగా పాకిస్తాన్ డ్రగ్స్‌ను తరలిస్తున్నదని తెలిపారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా చేసి తన కుయుక్తులను పారించాలని యోచిస్తున్నట్టు ఆరోపించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా జమ్ము కశ్మీర్‌లో సాగుతున్న హింస, ఉగ్రవాదంతో ఇప్పటికే ఒక తరం నష్టపోయామని.. ఈ మాదక ద్రవ్యాల ముప్పుతో ఇప్పటి తరాన్నీ కోల్పోయే ముప్పు ఉన్నదని పోలీసు అధికారి దిల్బాగ్ సింగ్ వివరించారు. గత రెండేళ్లలో జమ్ము కశ్మీర్, పంజాబ్‌లలో డ్రగ్స్ అక్రమ రవాణా భారీగా పెరిగిందని
అన్నారు. ముందు ఆయుధ శిక్షణ ఇస్తుందని, ఆ తర్వాత డ్రగ్స్ పంపి యువతను బానిసలుగా చేసుకుని తన చెప్పు చేతల్లోకి తీసుకుంటుందని పాకిస్తాన్‌పై దిల్బాగ్ సింగ్ మండిపడ్డారు. ఇదే కుట్రను ఇప్పుడు జమ్ము కశ్మీర్‌లోనూ అమలు జరుపుతున్నదని చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు పెద్ద మొత్తంలో హెరాయిన్‌ను పాకిస్తాన్ పంపిస్తున్నదని అన్నారు.

గుజరాత్‌లోని ముంద్ర పోర్టులో సుమారు 3వేల కిలోల డ్రగ్స్ లభించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీని విలువ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనాలు వేశారు. ఇది ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా గుజరాత్‌కు చేరినట్టు సమాచారం వచ్చింది. టాల్కమ్ పౌడర్ రూపంలో పట్టుబడ్డ ఈ డ్రగ్స్ భారీ కంటెయినర్‌లో ముంద్రా పోర్టుకు చేరింది.

Follow Us:
Download App:
  • android
  • ios