Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ చరిత్రకారుడు బాబాసాహెబ్ ఇకలేరు : మాటకందని బాధను అనుభవిస్తున్నానంటూ ప్రధాని ట్వీట్...

మాటలకందని బాధను అనుభవిస్తున్నాను. శివషాహీర్ Babasaheb Purandare మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చింది..  అంటూ ప్రధాని మోదీ తన అధికారి ట్విటర్ లో సంతాపం వ్యక్తం చేశారు 

Pained beyond words : PM Modi condoles historian Babasaheb Purandares death
Author
Hyderabad, First Published Nov 15, 2021, 11:58 AM IST

న్యూ ఢిల్లీ : ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, పద్మవిభూషన్ అవార్డు గ్రహీత బాబా సాహెబ్ సోమవారం ఉదయం మరణించారు. పురందరే మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. పురందరే మరణం తనకు మాటలకు అందని బాధను కలిగించిందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ మేరకు మోదీ తన అధికారి ట్విటర్ లో ‘మాటలకందని బాధను అనుభవిస్తున్నాను. శివషాహీర్ Babasaheb Purandare మరణం చరిత్ర, సాంస్కృతిక ప్రపంచంలో అతి పెద్ద శూన్యతను మిగిల్చింది. రానున్న తరాలు ఛత్రపతి శివాజీ మహారాజ్ తో మరింత కనెక్ట్ అయ్యేలా చేసేందుకు గాను పురందరే చేసిన కృషికి కృతజ్ఞతలు. ఆయన ఇతర రచనలు కూడా గుర్తుండిపోతాయి’ అని Narendra Modi సంతాపం వ్యక్తం చేశారు. 

అంతేకాక ‘పురందరే చాలా చమత్కారంగా మాట్లాడే వ్యక్తి మాత్రమే కాక భారతదేశ చరిత్ర గురించి ఆయనకు అపార జ్ఞానం ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఆయనతో చాలా సన్నిహితంగా మెలిగిన ఘనత నాకు లభించింది. కొన్ని నెలల క్రితం, ఆయన శతాబ్ది సంవత్సరపు కార్యక్రమంలో ప్రసంగిచాను’ అని మోదీ మరో ట్వీట్ లో తెలిపారు.  

Pained beyond words : PM Modi condoles historian Babasaheb Purandares death

ఆ సమయంలో మోదీ మాట్లాడుతూ ‘బాబా సాహెబ్ పురందరే రచన Shivaji Maharaj మీద ఆయనకు గల అచంచల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఆ రచనను చదువుతున్నప్పుడు శివాజీ మహారాజ్ సజీవుడై మన హృదయంలో సంచరిస్తారని ఆయన అన్నారు. బాబా సాహెబ్  కార్యక్రమాలకు లోగడ తాను హాజరు కావడాన్ని ఈ సందర్బంగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. 

సంపూర్ణ ఘనతతో కూడిన చరిత్రను, దాని స్ఫూర్తిని యువతకు చేరువ చేయడంతో ఆయన చూపిన ఉత్సాహాన్ని ప్రశంసించారు. చరిత్రను ఎల్లప్పుడూ దాని వాస్తవిక రూపంలో తెలియజేయడం మీద నిబద్ధతను ఆయన సదా పాటించారని కొనియాడారు. ‘దేశ చరిత్రకు సంబంధించి ఈ సమతూకం అవశ్యం అని.. తన వ్యక్తిగత విశ్వాసంతోపాటు తనలోని సాహితీవేత్త చారిత్రక స్ఫూర్తిని ప్రభావితం చేయకుండా ఆయన సదా జాగ్రత్త వహించారన్నారు. 

‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ సందర్భంగా భారత స్వాతంత్ర్య పోరాట చరిత్ర రచనలో బాబా సాహెబ్ పాటించిన ప్రమాణాలను అనుసరించాలని యువ చరిత్రకారులకు ఈ సందర్భంగా నా విజ్ఞప్తి’ అని ప్రధానమంత్రి సూచించారు. 

Kishan Reddy: షారుక్ ఖాన్‌తో శత్రుత్వం లేదు.. బీజేపీలో ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బాబాసాహెబ్ గా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే సోమవారం ఉదయం 5 గంటలకు పూణే (మహారాష్ట్ర)లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్యం కారణంగా కొద్ది రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో చేరారు. 

బాబా సాహెబ్ పురందరేను కేంద్ర ప్రభుత్వం 2019లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం Padma Vibhushan తో.. 2015లో రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర భూషన్ అవార్డుతో సత్కరించింది. పురందరే ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద వివిధ పుస్తకాలను కూడా రాశారు. చరిత్ర పరిశోధనలకు తన జీవితాన్ని అంకితం చేశారు. 

బాబా సాహెబ్ ’జాంత రాజా‘ అనే నాటకాన్ని కూడా రాసి దర్శకత్వం వహించారు. దీనిని 200 మంది కళాకారులు ప్రదర్వించారు. ఐదు భాషలలో అనువదంచారు. మరోవైపు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే పురందరే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో బాబా సాహెబ్ పురందరేకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios