కర్ణాటకలో మంత్రి రమేష్ బార్కిహోళి రాసలీల వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా... ఈ సెక్స్ టేప్ వెనక ఓ ఎమ్మెల్యే హస్త ఉందనే వార్తలు వస్తున్నాయి. మంగళవారం సీడీలు బయటకు రాగా.. జార్కిహోళి బుధవారం రాజీనామా చేయడం తెలిసిందే.

విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు గాలిస్తున్నారు. దాదాపు సంవత్సరం నుంచి వారి మధ్య ఈ వ్యవహారం నడుస్తుందని తెలుస్తోంది.

పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె మొబైల్‌ నంబరు కూడా లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. 

ఓ శాసనసభ్యుడు సదరు యువతి వెనుక ఉన్నట్లు జార్కిహొళి అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ శతృత్వంతో ఆయనే రహస్య వీడియోలు తీయించి బయటికి తెచ్చాడని చెబుతున్నారు.