భువనేశ్వర్: ప్రభుత్వ క్వార్టర్‌లోనే ఓ యువతిపై మాజీ పోలీస్ కానిస్టేబుల్ అతని సహచరులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొంది.  నిందితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకొంటామని పోలీసులు ప్రకటించారు.

ఒడిశా రాష్ట్రంలోని పూరి జధేశ్వరి ఆలయ సమీపంలోని ప్రభుత్వ క్వార్టర్‌లో సోమవారం ఈ దారుణం చోటుచేసుకుంది. నిమపార బస్‌ స్టేషన్‌లో బస్‌ కోసం వేచిచూస్తున్న బాలికను మాజీ కానిస్టేబుల్ మాయ మాటలు చెప్పి నమ్మించాడు. తాను పోలీసు కానిస్టేబుల్ అంటూ గుర్తింపు కార్డు చూపించి సహాయం చేపిస్తానని నమ్మించాడు

Also read:'దిశ'పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు: శ్రీరామ్ అరెస్ట్.

అయితే నిందితుడి సహాయం తీసుకొనేందుకు బాలిక నిరాకరించింది., అయినా కూడ అతను వినలేదు.దీంతో అతను బలవంతంగా ఆమెను కారులో ఎక్కించుకొని పూరిలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లోకి తీసుకెళ్లాడు.

ప్రభుత్వ క్వార్టర్స్‌లో బాలికపై తన స్నేహితులతో కలిసి బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డాడు. ఇద్దరు వ్యక్తులు క్వార్టర్‌కు బయట నుండి తాళం వేస్తే మరో ఇద్దరు వ్యక్తులు తనపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా బాధితురాలు చెప్పారు.

నిందితులు మద్యం సేవించి ఉన్న సమయంలో తాను మరో వ్యక్తి సహాయంతో  ప్రభుత్వ క్వార్టర్ నుండి తప్పించుకొని వచ్చినట్టుగా బాధితురాలు చెప్పారు.  ఐడీ కార్డు ఆధారంగా నిందితుడు మాజీ పోలీస్‌ కానిస్టేబుల్‌ జితేంద్ర సేథిగా గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.