Asianet News TeluguAsianet News Telugu

Kishan Reddy: షారుఖ్‌ ఖాన్‌తో శత్రుత్వం లేదు.. బీజేపీలో ఆయనకు ఫ్రెండ్స్ ఉన్నారు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ (Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ వెనకాల బీజేపీ కుట్ర ఉందని ఎన్సీపీతో పాటుగా పలు పార్టీల నాయకులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy) స్పందించారు. షారుఖ్ ఖాన్‌తో బీజేపీకి ఎలాంటి శత్రుత్వం లేదని అన్నారు.

No enmity with Shah Rukh Khan says Union minister Kishan Reddy
Author
Hyderabad, First Published Nov 15, 2021, 11:38 AM IST

క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో (drugs case) బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్ (Shah Rukh Khan) కొడుకు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) అరెస్ట్ కావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ వర్గాల్లోనే కాకుండా దేశం మొత్తం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో సైతం ఈ ఘటన పెను దుమారం లేపింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర పూరితంగా ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేయించిందని పలువురు రాజకీయ నాయకులు ఆరోపించారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మాత్రం మరో అడుగు ముందుకేసి బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటుగా కేసు విచారణ అధికారిగా ఉన్న సమీర్ వాంఖడేను లక్ష్యంగా చేసుకుని ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ నేతలు ఖండించారు. 

అయితే తాజాగా ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌కు సంబంధించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy) స్పందించారు. షారుఖ్‌ ఖాన్‌తో బీజేపీకి ఎలాంటి శత్రుత్వం లేదని అన్నారు. షారుఖ్ కొడుకు అరెస్ట్‌కు గానీ, అతని ప్రతిష్టకు భంగం కలిగించే ప్రచారం చేయడంతో గానీ తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఎన్సీబీ అధికారులు షారుఖ్ ఖాన్ కొడుకును అరెస్ట్ చేస్తే.. కొందరు మాత్రం బీజేపీపై బురద జల్లేందుకు ప్రయత్నించారని అన్నారు. బీజేపీ షారుఖ్ ఖాన్‌‌కు, ఆర్యన్‌ ఖాన్‌కు వ్యతిరకేంగా ఎందుకు కుట్ర చేస్తుందని ప్రశ్నించారు. అతను తమ శత్రువు కాదని.. అతని బీజేపీలో కొందరు స్నేహితులు కూడా ఉన్నారని చెప్పారు. 

కేంద్ర ప్రభుత్వానికి చాలా పని ఉందని.. ఇలాంటి సిల్లీ ఇష్యూస్‌ను పట్టించుకునే సమయం లేదని అన్నారు. ఒకవేళ ఏదైనా ఉంటే అతను దోషా.. కాదా అనేది కోర్టులు తెలుస్తాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.  మరోవైపు బీజేపీ కేంద్రంలోనే కాకుండా మరో 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉందన్నారు. కేంద్రంలో వరుసగా రెండు సార్లు తమ పార్టీకి అవకాశం కల్పించారని చెప్పారు. అభివృద్ది చేసేందుకు తమకు అవకాశం ఇచ్చారని.. దేశం కోసం మోదీ ప్రభుత్వం అనేక కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 

ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్ షిప్‌లో రైడ్ చేసిన ఎన్సీబీ అధికారులు డ్రగ్స్‌ వినియోగించిన ఆరోపణలపై ఆర్యన్‌ ఖాన్‌తో పాటుగా మరికొందరిని అరెస్ట్ చేశారు. అక్టోబర్ 3వ తేదీన వీరి అరెస్ట్‌ను ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే ధ్రువీకరించారు.  దీంతో ఒక్కసారిగా షారుక్ అభిమానుల్లో, బాలీవుడ్‌లో కలకలం రేగింది. అయితే ఆర్యన్ ఖాన్ తరఫు లాయర్లు మాత్రం.. అతడు డ్రగ్స్ వినియోగించలేదని, అందుకు ఎలాంటి వాదనలు కోర్టులో వాదనలు వినిపించారు. తొలుత కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు అక్టోబర్ 7 వరకు కస్టడీ విధించింది. ఆ తర్వాత మరో 14 రోజుల పాటు కస్టడీకి ఆదేశించింది. దీంతో అక్టోబర్ 8న ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలుకు తరలించారు. ఇక, ఆర్యన్ తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

అక్టోబర్ 26న బాంబే హైకోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్ తరఫున సీనియర్ లాయర్లు ముకుల్ రోహత్గీ, సతీశ్ మానెశిందే వాదనలు వినిపించారు. మరుసటి రోజు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఎన్సీబీ తరఫు న్యాయవాదులు కూడా కోర్టుకు వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 28న బాంబే కోర్టు ఆర్యన్ ఖాన్‌తో సహా నిందితులుగా మరో ఇద్దరికి బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ అక్టోబర్ 30న జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios