Fact Check: దావూద్ ఇబ్రహింపై విషప్రయోగం జరిగిందా? కరాచీలో ఆయన మరణించాడా?
దావూద్ ఇబ్రహింపై విషప్రయోగం జరిగిందని, ఆయన మరణించాడనీ వచ్చిన వార్తలు అవాస్తవం అని తేలింది. ఓ ఫ్యాక్ట్ చెక్ ఈ వార్తలను కొట్టిపడేసింది.
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహింపై విషప్రయోగం జరిగిందని, పాకిస్తాన్‌లో కరాచీలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని, ఆయన మరణించాడనీ మరికొన్ని వదంతులు వచ్చాయి. ఓ పాకిస్తాన్ యూట్యూబర్ చేసిన పోస్టు వైరల్ అయింది. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కూడా ఈ ప్రకటన చేసినట్టు ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ట్వీట్ స్క్రీన్ షాట్లు చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ వార్తల్లో నిజమెంత?
ఆ పాకిస్తాన్ యూట్యూబర్ చేసిన వీడియో అవాస్తవం అని తేలింది. ఇంటర్నెట్ షట్ డౌన్‌కు దావూద్ ఇబ్రహిం మరణానికి సంబంధం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ప్రతిపక్ష పీటీఐ పార్టీ వర్చువల్ సమావేశానికి ఆటంకం కలిగించడానికి ఏడు గంటలపాటు ఇంటర్నెట్ షట్ డౌన్ చేశారని తెలిపాయి.
ఇక పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ కాకర్.. దావూద్ ఇబ్రహిం మరణించాడని చెబుతున్న ట్వీట్ కూడా అసత్యం అని తేలింది. డీఎఫ్ఆర్ఏసీ ఫ్యాక్ట్ చెకింగ్ ఈ ట్వీట్ అవాస్తవం అని పేర్కొంది. అది పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రి అన్వర్ ఉల్ హక్ కాకర్ కాదని తేల్చింది.
Also Read : Lok Sabha: దక్షిణాదిపై జాతీయ నాయకుల చూపు?.. వ్యూహం అదేనా?
1955లో జన్మించిన దావూద్ ఇబ్రహిం ముంబయి లోని డోంగ్రిలో పెరిగాడు. 1993 ముంబయి వరుస పేలుళ్ల ఘటన తర్వాత ఆయన ముంబయి వదిలిపెట్టాడు. ఆ కేసును మహారాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో సీబీఐ టేకప్ చేసింది.