న్యూఢిల్లీ: నిర్భయ గ్యాంగ్ రేప్, హత్య కేసు నిందితులు 23 సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించారు. గత ఏడేళ్లుగా నలుగురు దోషులు ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ ఏడేళ్ల కాలంలో వాళ్లు 23 సార్లు జైలు రూల్స్ బ్రేక్ చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. పనులు చేయడం ద్వారా వాళ్లు రూ.1 లక్షా 37 వేల రూపాయలు సంపాదించారు. 

2012లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్షయ్ ఠాకూర్ సింగ్, ముకేష్, పవన్ గుప్తా, వినయ్ శర్మ దోషులుగా తేలిన విషయం తెలిసిందే. ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై అఘాయిత్యం చేసి, ఆమెను చిత్రహింసలు పెట్టి చంపేశారు. వారికి జనవరి 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయనున్నారు.

Also Read: నిర్భయ దోషులకు ఉరి ఖాయం... క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత

జైలు నిబంధనలు ఉల్లంఘించినందుకు వినయ్ 11 సార్లు శిక్ష వేశారు. అక్షయ్ ఒక్కసారి, ముకేష్ మూడుసార్లు, పవన్ ఎనిమి సార్లు జైలు నిబంధనలను ఉల్లంఘించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

ముకేష్, పవన్, అక్షయ్ 2016లో పదో తరగతిలో అడ్మిషన్ తీసుకుని పరీక్షలు కూడా రాశారు. కానీ పాస్ కాలేదు. వినయ్ 2015లో బాచిలర్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ పూర్తి చేయలేదు. 

Alao Read: నిర్భయ కేసులో ట్విస్ట్: రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరిన ముఖేష్ సింగ్

ఉరిశిక్ష వేయడానికి ముందు దోషులను రెండు సార్లు కలుసుకోవడానికి వారి కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. వినయ్ తండ్రి మంగళవారం వచ్చి చూసి వెళ్లాడు. దోషులను వేర్వేరు సెల్స్ పెట్టి సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటర్ చేస్తున్నారు. ఆదివారంనాడు డమ్మీ ఉరి ప్రయోగం చేశారు.