న్యూఢిల్లీ: ఉరి శిక్షను తప్పించుకోవడానికి అన్ని న్యాయపరమైన వెసులుబాట్లను వాడుకుని, ఇక ఏ మార్గం కూడా లేని స్థితిలో నిర్భయ కేసు దోషులు నలుగురిలో ఒకతను నిరాహార దీక్షకు దిగాడు. మార్చి 3వ తేదీన నలుగురిని ఉరి తీయాలని పాటియాల కోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 

దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ తీహార్ జైలులో నిరాహార దీక్ష చేస్తున్నాడని జైలు అధికారులు తాజా డెత్ వారంట్ కు ముందు కోర్టుకు తెలియజేశారు. చట్టప్రకారం తగిన జార్గత్తలు తీసుకోవాలని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా జైలు సూపరింటిండెంట్ కు తెలియజేశారు.

Also Read: దోషులకు కొత్త డెత్ వారంట్: నిర్భయ తల్లి స్పందన ఇదీ

వినయ్ కుమార్ శర్మపై దాడి జరిగిందని, దాంతో తలపై గాయంతో బాధపడుతున్నాడని అతని తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకునేందుకు తాజా పిటిషన్ ను తయారు చేస్తున్నట్లు ముకేష్కుమార్ సింగ్ తరఫు న్యాయవాది చెప్పారు.

తన తరఫున వాదించడానికి కోర్టు నియమించిన న్యాయవాది వృందా గ్రోయర్ సేవలను తాను వాడుకోదలుచుకోలేదని నలుగురిలో ఓ దోషి ముకేష్ సింగ్ తెలిపాడు. 

Also Read: నిర్భయదోషులను ఉరితీయడానికి మరోసారి "ముహూర్తం" ఫిక్స్... కొత్త డెత్ వారెంట్ జారీ