Asianet News TeluguAsianet News Telugu

నాపై జైలులో లైంగిక దాడి: నిర్భయ దోషి ముఖేష్ సంచలనం

నిర్భయ కేసులో దోషి ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు.  తనపై లైంగిక దాడి జరిగిందని  ఆయన ఆరోపణలు చేశారు. 

Nirbhaya case: lawyer's sensational claim in Supreme Court - Mukesh was physically abused in Tihar
Author
New Delhi, First Published Jan 28, 2020, 3:21 PM IST


న్యూఢిల్లీ: నిర్భయ కేసులో  దోషి ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. తీహార్ జైలులో తనపై లైంగిక దాడి జరిగిందని ముఖేష్ సింగ్ ఆరోపించారు.

నిర్భయ కేసులో ముఖేష్ సింగ్  రాష్ట్రపతి తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  క్షమాభిక్షను సవాల్ చేసే హక్కు లేదు. అయితే క్షమాభిక్ష పిటిషన్ కు సంబంధించిన ప్రక్రియలో తనకు అన్యాయం జరిగిందని  ఆరోపిస్తూ ముఖేష్ సింగ్ ఈ పిటిషన్ ను దాఖలు చేశారు.

Also read:మరో ఎత్తుగడ: మెర్సీ పిటిషన్ తోసివేతపై సుప్రీంకెక్కిన నిర్భయ కేసు దోషి

తీహార్ జైలులో ఈ కేసులో సహ నిందితుడు అక్షయ్ ఠాకూర్ తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా అక్షయ్ ఠాకూర్ చెప్పారు. తీహార్ జైలు అధికారులకు ఈ విషయం తెలుసునని కూడ ముఖేష్ సింగ్ చెప్పారు. ఈ విషయాలన్ని తాను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్టుగా ముఖేష్ సింగ్ చెప్పారు. 

Also Read: నిర్భయ దోషులు: 24 గంటల పాటు నిఘా, ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్తలు

తన క్షమాబిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి సరిగా చూడలేదని ముఖేష్ సింగ్ అభిప్రాయపడ్డారు. 32 ఏళ్ల ముకేష్ కుమార్ సింగ్ మెర్సీ పిటిషన్ ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ జనవరి 17వ తేదీన తిరస్కరించారు.

Also Read: ఉరిశిక్షలో మరో ట్విస్ట్.. సుప్రీమ్ కోర్టుకు నిర్భయ నిందితుడు

ఉరిశిక్షను ఫిబ్రవరి 1వ తేదీన అమలు చేస్తున్నప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అత్యంత ప్రధానమైందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ లు కూడా ఉన్న సుప్రీం బెంచ్ వ్యాఖ్యానించింది. ఉరితీతను ఫిబ్రవరి 1వ తేదీన నిర్మయించినందున మెన్షనింగ్ ఆఫీసర్ ను కలవాలని మఖేష్ సింగ్ తరఫు న్యాయవాదికి సూచించింది.

Also Read: నిర్భయ దోషులు: 24 గంటల పాటు నిఘా, ఆత్మహత్య చేసుకోకుండా జాగ్రత్తలు

నిర్భయ కేసుకు సంబంధించిన నలుగురు దోషులను ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాలని కోర్టు డెత్ వారంట్ జారీ అయిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు క్యురేటివ్ పిటిషన్ ను తిరస్కరించిన తర్వాత ముకేష్ సింగ్ రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాడు. మరో దోషి అక్షయ్ కుమార్ క్యురేటివ్ పిటిషన్ ను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

Also Read: ఉరిశిక్షలో మరో ట్విస్ట్.. సుప్రీమ్ కోర్టుకు నిర్భయ నిందితుడు

మరో ఇద్దరు దోషులు పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంది. 2012 డిసెంబర్ లో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి, చిత్రహింసలు పెట్టి హత్య చేసిన కేసులో నలుగురికి ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే.

 

Follow Us:
Download App:
  • android
  • ios