Asianet News TeluguAsianet News Telugu

లెహెంగా ఫాల్స్‌లో దాచి డ్రగ్స్ రవాణా.. పట్టుబడ్డ కోట్ల విలువ చేసే మాదకద్రవ్యం

లెహెంగా ఫాల్స్‌లో డ్రగ్స్ దాచి ఆస్ట్రేలియాకు తరలించడానికి సిద్ధంగా ఉన్న డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. బెంగళూరులో ఈ డ్రగ్స్ పట్టుబడింది. ఈ డ్రగ్స్‌ కేసులో చెన్నైకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు.
 

NCB officials unearthed crores worth drugs in lehengas
Author
Bengaluru, First Published Oct 23, 2021, 3:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

బెంగళూరు: దేశవ్యాప్తంగా డ్రగ్స్‌పై చర్చ తీవ్రంగా జరుగుతున్నది. ముంద్రా పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు.. బాలీవుడ్ మొదలు టాలీవుడ్ వరకు మాదకద్రవ్యాల అంశం కలకలం రేపుతున్నది. డ్రగ్స్ అక్రమ రవాణా కోసం దుండగులు ఎంచుకున్న తీరు ఆశ్చర్యచకితులను చేస్తున్నది. సాధారణ ప్రజలనే కాదు.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులే నివ్వెరపడుతున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో వెలుగుచూసింది. కోట్ల విలువ చేసే Drugsను ఎవరికీ అనుమానమైనా రానంత చాకచక్యంతో Lehenga ఫాల్స్‌లో దాచి రవాణాకు సిద్ధం చేశారు.

ముందస్తుగా అందిన సమాచారం మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ గుట్టును రట్టు చేశారు. Australiaకు తరలించడానికి సిద్ధంగా ఉన్న మూడు కిలోల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.

Also Read: తెలంగాణ: మేడ్చల్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. విద్యార్ధులే టార్గెట్

ఎన్‌సీబీ Bengaluru జోనల్ డైరెక్టర్ అమిత్ ఘవాటే సారథ్యంలోని టీమ్ ఈ డ్రగ్స్‌ను పట్టుకుంది. ఈ నెల 21న మూడు లెహెంగాల్లో దాచిన మూడు కిలోల డ్రగ్స్‌ను వీరి బృందం కనుకొనింది. లెహెంగా ఫాల్ లైన్‌ ఒక్కో ముడతను విప్పుతుండగా ఈ డ్రగ్స్ బయటకు వెలుగుచూసింది. సరుకును ఆంధ్రప్రదేశ్‌లోని నర్సపురం నుంచి పంపినట్టుగా పార్సిల్‌పై ఉన్నది. ఈ సరుకును ఆస్ట్రేలియాకు పంపనున్నారు. అధికారులు ఈ షిప్‌మెంట్‌ను ట్రాక్ చేసి చెన్నైలోని అసలు నిందితుడిని కనిపెట్టారు.

ఈ మాదక ద్రవ్యాలను చెన్నైలోని నిందితుడే పంపినట్టు అధికారులు గుర్తించారు. రెండు రోజులు కృషి చేసి చెన్నైలోని వ్యక్తి ఈ parcel పంపినట్టు కనుగొన్నారు. చెన్నై నుంచే ఈ పార్సిల్ చేరినట్టు అభిప్రాయానికి వచ్చారు. ఎందుకంటే నిందితుడు నకిలీ చిరునామాలతో, నకిలీ ఐడీలతో డ్రగ్స్‌ను సరఫరా చేసే వ్యవహారానికి పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios