పోర్న్ కి విపరీతంగా బానిసగా మారిన ఓనేవీ అధికారి.. భార్య ఫోటోలను కూడా అసభ్యరీతిలో మార్ఫింగ్ చేసి.. ఆన్ లైన్ లో షేర్ చేశాడు.. కాగా.. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నేవీ అధికారిని అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఢిల్లీకి చెందిన నేవీ అధికారి ఒకరు పోర్నోగ్రఫీకి బానిసగా మారాడు. తరచూ వాటిని చూస్తూ.. అందరి మహిళల ఫోటోలను అసభ్యరీతిలో మార్ఫింగ్ చేసి.. పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడం లాంటివి చేస్తున్నాడు. దీనిని గమనించిన ఆయన భార్య.. నచ్చచెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ అతనిలో ఎలాంటి మార్పు రాలేదు.

దీంతో విసిగిపోయిన ఆమె.. తన పిల్లలను తీసుకొని భర్తకు దూరంగా వచ్చేసింది. వచ్చేటప్పుడు భర్త ఫోన్ ని కూడా ఆమె తన వెంట తీసుకువచ్చింది. అయితే ఆ ఫోన్ లో తన ఫోటోలు అసభ్యకరంగా ఉండటాన్ని ఆమె గమనించింది. వాటిని పోర్న్ వెబ్ సైట్లలో అప్ లోడ్ చేసి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. 

తనతోపాటు మరికొందరు మహిళల ఫోటోలు కూడా ఉండటంతో.. వెంటనే భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఇతర మహిళల నుంచి తమకు ఫిర్యాదులు అందలేదని పోలీసులు తెలిపారు. తన భర్తకు ఆయన కొలీగ్ భార్యతో వివాహేతర సంబంధం ఉందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నేవీ కమాండర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని ప్రశ్నించేందుకు అనుమతి కోరుతూ నేవీ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్టు తెలిపారు