Asianet News TeluguAsianet News Telugu

నమస్తే ట్రంప్ ఈవెంట్: 2,800 పదాల స్పీచ్, మోడీని 17 సార్లు తలచుకున్న ట్రంప్

మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రరాజ్యాధినేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌తో అమెరికా సంబంధాలు, ట్రంప్‌తో మైత్రి గురించి ప్రస్తావించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ట్రంప్ భారతీయుల మనసును గెలుచుకునేందుకు యత్నించారు. 

namaste trump Event: us president Donald Trump chants pakistan four times
Author
New Delhi, First Published Feb 25, 2020, 3:54 PM IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబంతో సహా భారతదేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబంతో సహా వచ్చిన సంగతి చేరుకున్న సంగతి తెలిసిందే. తొలి రోజు సోమవారం అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో అగ్రరాజ్యాధినేత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భారత్‌తో అమెరికా సంబంధాలు, ట్రంప్‌తో మైత్రి గురించి ప్రస్తావించారు. ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన ట్రంప్ భారతీయుల మనసును గెలుచుకునేందుకు యత్నించారు.

Also Read:సబర్మతీలో ట్రంప్ అలా: రాజ్ ఘాట్ బుక్ లో మాత్రం గాంధీ ప్రస్తావన

నమస్తే ట్రంప్ ఈవెంట్‌లో ప్రసంగించేందుకు గాను ముందుగానే ప్రీపేర్ అయిన ఆయన దాదాపు 2,800 పదాల్లో స్పీచ్ రాసుకున్నారు. దీనిలో భాగంగా పలు పదాలను ట్రంప్ పదే పదే ప్రస్తావించారు.

ముఖ్యంగా ఇండియా, ఇండియాస్, ఇండియన్స్ అన్న పదాలను సుమారు 60 సార్లు పలికారు. మిలటరీ, టెర్రరిజం, డిఫెన్స్, ఆర్మ్‌డ్, ఐఎస్ఐఎస్ అనే పదాలను 20 సార్లు ఉచ్చరించారు.

ఢిల్లీ స్కూల్లో నుదుట తిలకం దిద్ది, హారతి ఇచ్చి మెలానియాకు స్వాగతం

మోడీ, ప్రైమ్ మినిస్టర్ పదాలను 17 సార్లు అన్నారు. లవ్, లవ్స్, హర్మోనీ, ఫ్రెండ్‌షిప్, పీస్, యూనిటీ పదాలు 14 సార్లు అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వచ్చాయి. పాకిస్తాన్, పాకిస్తానీ అన్న పదాలను కేవలం నాలుగు సార్లు మాత్రమే ట్రంప్ పలికారు. ఇక మన ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్ పేరును 22 పర్యాయాలు ఉచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios