నాగపూర్: మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మహిళపై అత్యాచారం చేసి, ఆమె ప్రైవేట్ భాగాల్లో ఇనుప రాడ్స్ ను జొప్పించాడు. ఈ సంఘటన గతవారం జరిగిందని, నిందితుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. 

ఆ భయంకరమైన సంఘటన జనవరి 21వ తేదీన జరిగింది. నిందితుడు యోగిలాల్ రహంగ్దలే స్పిన్నింగ్ మిల్లులో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాడు. మహిళ తన సోదరుడు, నిందితుడు, మరో మహిళతో కలిసి ఉంటోంది. 

also Read: పదహారేళ్ల అమ్మాయి మృతి: రేప్, హత్య అనుమానం, సహ విద్యార్థి పనే

జనవరి 21వ తేదీన బాధిత మహిళ సోదరుడు, మరో మహిళ ఊరికి వెళ్లారు. ఆ సమయంలో యోగిలాల్ మహిళపై దాడి చేశాడు. ఒంటరిగా ఉన్న మహిళపై యోగిలాల్ అత్యాచార యత్నం చేశాడు. దాన్ని అడ్డుకోవడానికి మహిళ ప్రయత్నించడంతో ఆమె నోట్లో దుస్తులు కుక్కాడు. 

దాంతో మహిళ స్పృహ తప్పి పడిపోయింది. స్పృహ తప్పి పడిపోయిన మహిళపై యోగిలాల్ అత్యాచారం చేసి, ప్రైవేట్ పార్ట్స్ లో ఇనుపరాడ్ జొప్పించాడు. ఈ మేరకు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read: ఇంట్లోంచి ఎత్తుకెళ్లి పత్తి చేనులో మహిళపై ఏడుగురు గ్యాంగ్ రేప్

మహిళ సోదరుడు శుక్రవారంనాడు తిరిగి వచ్చాడు. వారిద్దరు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. మహిళ, యోగిలాల్, మహిళ సోదరుడు, మరో మహిళ స్పిన్నింగ్ మిల్లులోనే పనిచేస్తున్నారు. ఈ సంఘటన నాగపూర్ లోని పర్ది ప్రాంతంలో జరిగింది.