నాగపూర్: శృంగారంలో అమితమైన ఆనందాన్ని ఆస్వాదించడానికి ఓ మహిళ చేసిన పని ప్రియుడి ప్రాణాలను బలి తీసుకుంది. నైలాన్ తాడు మెడకు చుట్టుకుని ప్రియుడు మరణించాడు. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో గల ఖాపర్ ఖేడ్ గ్రామం లాడ్జిలో శుక్రవారం ఉదయం ఆ సంఘటన వెలుగు చూసింది. 

నాగపూర్ కు చెందిన 30 ఏళ్ల యువకుడికి స్థానికంగా ఉన్న ఓ మహిళతో ఐదేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. గురువారం రాత్రి వారిద్దరు లాడ్జికి వచ్చారు. కామోద్దీపన కోసం ఆమె తన ప్రియుడు జియావుద్దీన్ అన్సారీ కాళ్లు చేతులను నైలాన్ తాడుతో ఓ కుర్చీకి కట్టింది. మెడ చుట్టూ మరో తాడు బిగించింది. 

ఆలా చేయడం వల్ల కామోద్దీపన కలిగి మరింత ఆనందాన్ని ఆస్వాదించవచ్చునని ఆమె భావించింది. ఆ యువకుడు కుర్చీకి అలా ఉండగానే ఆమె స్నానాల గదికి వెళ్లింది. ఆ సమయంలో కుర్చీ జారి కిందపడింది. దాంతో నైలాన్ తాడు అతని మెడకు బిగుసుకుని ఉపిరాడక చనిపోయాడు. 

ప్రేయసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తమ మధ్య ఉన్న వివాహేతర సంబంధాన్ని ఆమె పోలీసు విచారణలో అంగీకరించింది. ఇరువురిని సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సంఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని, మహిళ పథకం ప్రకారం అన్సారీని హత్య చేసిందని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫైర్ ఇంజనీర్ అయిన అన్సారీ ఇటీవల ఓ యువతిని వివాహం చేసుకున్నాడని, ఇటీవలే సంతానం కలిగిందని, దాంతో మహిళ అసంతృప్తికి గురై అతన్ని హత్య చేసిందని అంటున్నారు. 

తమ ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని, అయితే తమ కుటుంబాలు అంగీకరించకపోవడంతో పూణే లేదా ముంబై వెళ్లిపోదామని అనుకున్నామని అన్సారీ ప్రియురాలు పోలీసులతో చెప్పింది.