ముజఫర్‌పూర్ సెక్స్ రాకెట్ ఎఫెక్ట్.... బీహార్ మహిళా మంత్రి రాజీనామా

Muzaffarpur shelter home scandal: Bihar Minister Manju Verma resigns
Highlights

బిహార్ రాష్ట్రం ముజఫర్పూర్ లో ఓ ఎన్జీవో సంస్థ నిర్వహిస్తున్న వసతి గృహంలో 40 మంది అమ్మాయిలపై లైంగిక దాడి జరిగినట్లు బైటపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన బీహార్ ప్రభుత్వంలో కూడా అలజడి సృష్టించింది. ఈ సెక్స్ రాకెట్ తో సంబంధాలున్నట్లు బైటపడటంతో నితీశ్ ప్రభుత్వంలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మంజు వర్మ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఇవాళ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తో సమావేశమైన కాస్సేపటికే ఆమె ఈ ప్రకటన చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి సమర్పించినట్లు మంజు వర్మ ప్రకటించారు.

ముంబయికి చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ కొద్ది రోజుల క్రితం చేసిన తనిఖీల్లో బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు వసతి గృహ నిర్వహకుడే ఈ పని చేయిస్తున్నట్లు గుర్తించారు. అయితే ప్రధాన నిందితుడు బ్రిజేష్ కుమార్ తో మంత్రి మంజు భర్త చంద్రశేఖర్ వర్మకు సంబంధాలున్నట్లు బైటపడింది. మంత్రి భర్త తరచూ ఈ వసతి గృహానికి వెలుతుండేవాడని పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని  మిత్రపక్షం బిజెపితో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.   
 
ఈ ఆరోపణలపై ఇప్పటికే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జిల్లా శిశు సంరక్షణ అధికారి, ఈ వసతి గృహానికి చెందిన మహిళా సిబ్బంది సహా పది మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం వెదుకుతున్నామని చెప్పారు.
 
loader