Asianet News TeluguAsianet News Telugu

Bypolls Results 2022: "ప్రజాస్వామ్య హత్య": ఉప ఎన్నికల ఫలితాలపై అఖిలేష్ అసంతృప్తి

Bypolls Results 2022: ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా భావించే రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలనుఅధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) కైవసం చేసుకుంది. ఈ ఫ‌లితాల‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య హ‌త్య జ‌రిగిందని ఆరోపించారు.

Murder Of Democracy Akhilesh Yadav On UP Bypoll Results
Author
Hyderabad, First Published Jun 27, 2022, 3:38 AM IST

Bypolls Results 2022: ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలుగా భావించే రాంపూర్, అజంగఢ్ లోక్‌సభ స్థానాలనుఅధికార భారతీయ జనతా పార్టీ (బిజెపి) కైవసం చేసుకుంది. ఈ ఫ‌లితాల‌పై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బిజెపి పాలనలో "ప్రజాస్వామ్య హత్య" జరిగిందని   ఆరోపించారు. అజంగఢ్, రాంపూర్ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థుల ఓటమి తర్వాత, ఓట్ల లెక్కింపులో బీజేపీ ట్యాంపరింగ్ చేసి అభ్యర్థులను అణచివేస్తోందని ఖిలేష్ యాదవ్ ఆరోపించారు. గతంలో అజంగఢ్ నుంచి ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ కూడా ఈవీఎంలను మార్చారని ఆరోపణలు చేశారు.

 ఈ విషయాన్ని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేస్తూ తెలిపారు. ఎన్నిక‌ల ప్రారంభం నుంచి అణిచివేత జ‌రుగుతుంద‌ని,  నామినేషన్ల తిరస్కరణకు కుట్ర, అభ్యర్థులను అణచివేయడం, ఓటింగ్‌ను నిరోధించేందుకు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, కౌంటింగ్‌లో అక్రమాలు, ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి, ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టడం.. ఇదేనా  'ఆజాదీ కే అమృత్ కాల్ అని బీజేపీని ప్ర‌శ్నించారు.
 
మోసం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేయడం, బలవంత పరిపాలన, గూండాయిజం, ఎన్నికల సంఘంపై ఒత్తిడి తీసుక‌రావ‌డం వంటి చ‌ర్య‌ల్లో బీజేపీ విజ‌యం సాధించింద‌ని ఆరోపించారు. ప్రజాస్వామ్యం రక్తసిక్తమైందనీ, ప్రజా ఆదేశం పోయిందని అన్నారు. ఈ స‌మయంలోనే బుజ్జగింపులు, కులతత్వం ఆధారంగా ఎన్నికల్లో గెలుపొందలేమ‌ని కేశవ్ ప్రసాద్ మౌర్య అఖిలేష్ యాదవ్‌పై విరుచుకుపడ్డారు.

అజంగఢ్‌లో సినీ నటుడు,  బిజెపి అభ్యర్థి దినేష్ లాల్ యాదవ్ నిర్హువా ఎస్పీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్‌పై 8,679 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అలాగే.. రాంపూర్‌లో ఎస్పీ అభ్యర్థి మొహమ్మద్ అసిమ్ రాజాపై బిజెపి అభ్య‌ర్థి ఘన్‌శ్యాం లోధీ 42,192 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇలా ఎస్పీ కంచు కోట‌ను బీజేపీ ధ్వంసం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios