మానవ సంబంధాలు రోజు రోజుకీ దారుణంగా తయారౌతున్నాయి. సొంత చెల్లెలి పరువునే ఓ అక్క నడి రోడ్డుపై పెట్టింది. చెల్లి నగ్న చిత్రాలను బాయ్ ఫ్రెండ్ కి పంపించింది. చెల్లెలు స్నానం చేస్తుండగా రహస్యంగా ఫోటోలు తీసి మరీ పంపింది. ఈ దారుణ సంఘటన ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... ముంబయికి చెందిన ఓ యువతికి దినేశ్ మారయ్య అనే వివాహితుడితో నాలుగేళ్లుగా పరిచయం ఉంది. అతను వివాహితుడని తెలిసినా వివాహేతర సంబంధం పెట్టుకుంది. దినేశ్ కి అప్పటికే పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా.... సదరు యువతితో రాసలీలు మాత్రం కొనసాగించాడు. తాజాగా అతని కన్ను సదరు యువతి చెల్లెలిపై పడింది.

తన చెల్లెలి ఫోటోలను తనకు పంపాలని యువతిని కోరాడు. మొదట కుదరదని తెలపిన ఆమె.. పెళ్లి చేసుకోనని బెదిరించడంతో సరేనని చెప్పింది. తన చెల్లెలు స్నానం చేస్తుండగా దినేశ్‌కు ఆమె వీడియో కాల్ చేసింది. దీన్ని అదునుగా తీసుకుని స్క్రీన్ షాట్స్ తీసుకున్నాడు.
 
ఇదిలా ఉంటే.. ఈ బుధవారం దినేశ్ ఫోన్‌లో ఆ ఫొటోలను గమనించిన అతని భార్య .. వెంటనే ఈ విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులకు తెలిపింది. అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలి అక్కను విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితులిద్దరినీ గురువారం అదుపులోకి తీసుకున్నారు.

కాగా... ఇటీవల దాండియా ఆటలు ఆడుతున్న సమయంలో బాధిత యువతి దాండియా కర్ర దినేశ్ కూతురికి తగిలింది. ఆ విషయంలో పగతోనే ఆమె నగ్నచిత్రాలను తీసుకుంటున్నట్లు అతను పోలీసులకు చెప్పడం గమనార్హం.