ఓ వ్యక్తి నాలుగేళ్ల బాలుడి ఎదుట హస్త ప్రయోగం చేశాడు. కాగా... బాలుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. ఈ సంఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  ముంబయిలోని బంద్ర ప్రాంతానికి చెందిన ఓ టైలరింగ్ దుకాణం ఎదుట ఓ నాలుగేళ్ల  బాలుడు ఆడుకుంటున్నాడు. కాగా.. ఆ టైలరింగ్ దుకాణం యజమాని బాలుడిని లోపలికి పిలిచి అతని ఎదుట హస్త ప్రయోగం చేశాడు. అది చూసి భయపడిన ఆ బాలుడు వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని ఇంటి కి పరుగులు తీశాడు.

అతను చూసిన దానిని వెంటనే తన కుటుంబసభ్యులకు తెలియజేశాడు. కాగా.. బాలుడి తల్లి వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ టైలర్ ని అరెస్టు  చేశారు. కాగా.. బాలుడి తండ్రి ఓ బిజినెస్ మెన్ అని పోలీసులు చెప్పారు. నిందితుడి మీద పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.