Asianet News TeluguAsianet News Telugu

అప్పు కింద భార్యలను రాసిచ్చిన అన్నదమ్ములు.. గర్భం రావడంతో..

అప్పు ఇచ్చిన వ్యక్తికి  కావాల్సినప్పుడల్లా .. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అతని పడక సుఖం తీర్చీలా వారి భర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు. 

Mumbai: Sisters forced into sex with creditors by their husbands
Author
Hyderabad, First Published Oct 22, 2018, 11:41 AM IST

ముంబయి నగరంలో దారుణం చోటుచేసుకుంది.  చేసిన అప్పు తీర్చడానికి ఇద్దరు అన్నదమ్ములు తమ భార్యల పట్ల నీచంగా ప్రవర్తించారు. ఒకే ఇంటికి కోడళ్లుగా వచ్చిన ఇద్దరు అక్కాచెల్లెల్లకు వారి భర్తలు, అత్తమామలు నరకం చూపించారు. అప్పు కింద.. ఆ ఇద్దరు అక్కాచెల్లెల్లను రాసిచ్చారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెల్లు.. ఇద్దరు అన్నాదమ్ముళ్లను పెళ్లాడారు. 2015లో వీరి వివాహం జరిగింది. కాగా.. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన వారికి జీవితం నరకప్రాయం అయ్యింది. ఇంటి అప్పుతీర్చేందుకు ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను వారి భర్తలు.. తమకు అప్పు ఇచ్చిన వారికి రాసిచ్చారు.

 అప్పు ఇచ్చిన వ్యక్తికి  కావాల్సినప్పుడల్లా .. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు.. అతని పడక సుఖం తీర్చీలా వారి భర్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవేమీ తెలియని ఆ అక్కాచెల్లెళ్లు.. అప్పు ఇచ్చిన వాడి కామానికి బలయ్యారు. కొద్ది నెలల క్రితం.. ఆ  వ్యక్తి ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లను వేరే ఓ ప్రాంతానికి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడు. ఇదేమిటని నిలదీయగా.. తమ భర్తలే రూ.1.5లక్షల కోసం తనిఖీ పెట్టినట్లు తెలుసుకొని నిర్ఘాంతపోయారు.

ఇంటికి వెళ్లి.. భర్త, అత్తమామలను వారు నిలదీయగా.. పుట్టింటికి వెళ్లి ఇద్దరూ చెరో రూ.5లక్షలు తేవాలని లేకపోతే.. అప్పు ఇచ్చిన వారితో శృంగారం చేయాల్సిందేనని చెప్పారు. ఇదిలా ఉండగా.. ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లలో ఒకరు ఇటీవల గర్భం దాల్చారు. దీంతో.. ఆమెను అబార్షన్ చేయించుకోవాల్సిందిగా అత్తమామలు ఒత్తిడి చేశారు. దీంతో.. బాధితురాళ్లు ఇద్దరు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కాగా.. ఇప్పటి వరకు నిందితులు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడం గమనార్హం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios