న్యూఢిల్లీ: రెపో రేటును ఆర్బీఐ 25 బేసిక్ పాయింట్లకు తగ్గించింది.ఆన్‌లైన్ నగదు బదిలీలపై చార్జీలను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకొంది.

కీలక వడ్డీ రేట్లను   తగ్గిస్తూ  ఆర్బీఐ గురువారం నాడు నిర్ణయం తీసుకొంది. ద్రవ్యోల్బణం 3.1 శాతంగా ఆర్బీఐ అంచనా వేసింది. రెపోరేటును తగ్గించడం  వల్ల గృహ, వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి.

2010 సెప్టెంబర్‌ తర్వాత రెపో రేటు 6 శాతానికి దిగువన ఉండడం ఇదే ప్రథమంగా ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉంది. రెపో రేటు 25 బేసీక్ పాయింట్లు తగ్గించడంతో  అది 5.75 శాతానికి చేరింది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును వరుసగా 5.50 శాతం, 6 శాతానికి సవరించింది.

ఆర్ధికవృద్ది నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గడంతో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.