దారుణం.. 15ఏళ్ల బాలిక కిడ్నాప్, రేప్

MP man kidnaps, rapes 15-yr-old, tries to kill her by smashing head with stone
Highlights

బండరాయితో బాలిక తలపై మోదీ హత్య చేయాలని కూడా ప్రయత్నించాడు. 

మధ్యప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి.. అనంతరం అత్యాచారం చేశాడు. అంతేకాకుండా బండరాయితో బాలిక తలపై మోదీ హత్య చేయాలని కూడా ప్రయత్నించాడు. ఈ సంఘటన  మధ్య ప్రదేశ్  రాష్ట్రంలో సావిత్రి అనే గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
హరిరామ్ కౌషల్ అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలిక తీవ్ర గాయాలపాలై లభించినట్లు వారు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలిక కుటుంబసభ్యులకి బుధవారం సాయంత్రం మరో కుటుంబంతో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాలిక కరగ్ పూర్ పోలీసు స్టేషన్ కి బయలు దేరింది. దీనిని అవకాశంగా తీసుకున్న హరిరామ్ కౌశల్.. బాలికకు లిఫ్ట్ ఇస్తానని చెప్పి వాహనం ఎక్కించుకొని కిడ్నాప్ చేశాడు.

ఈ రోజు ఉదయం పోలీసుల ఆచూకీ లభించింది. నిందితుడిపై అత్యాచారం, హత్యాయత్నం కేసుల కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. ఆస్పత్రిలో చికిత్స పొంపదుతోందని వారు వివరించారు.

loader