బెంగుళూరు: బాలికపై అత్యాచారానికి పాల్పడిన 30 మందిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు నిర్వహించిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి.కన్నకూతురితో తల్లే వ్యభిచారం నిర్వహిస్తోందని పోలీసులు గుర్తించి షాక్ కు గురయ్యారు.

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని శృంగేరీలో ఓ బాలికపై 30 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది.ఈ విషయమై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు నివ్వెరపోయే వాస్తవాలను గుర్తించారు.

కన్న కూతురిని సోదరి కూతురిగా స్థానికులకు పరిచయం చేసింది. ఉత్తర కర్ణాటక నుండి కూతురితో సహా వచ్చి ఆమె శృంగేరీలో నివాసం ఉంటుంది.ఏడాదిగా తనపై 30 మంది అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిన్నిగా చలామణి అవుతున్న మహిళే ఆ బాలిక స్వంత తల్లిగా పోలీసులు గుర్తించారు.డబ్బుల కోసం కూతురితో ఆమె వ్యభిచారం చేయిస్తున్నట్టుగా గుర్తించారు.

బాలికపై అత్యాచారానికి పాల్పడిన 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.