భర్త కళ్లెదుటే భార్య, కూతురిపై 20 మంది గ్యాంగ్ రేప్

Mother and daughter gangraped in Gaya district at bihar
Highlights

భర్త కళ్లెదుటే భార్య, కూతురిపై 20 మంది గ్యాంగ్ రేప్

బిహార్‌లో దారుణం జరిగింది.. భర్త కళ్లేదుట అతని భార్య, కుమార్తెపై 20 మంది కామాంధులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బీహార్‌లోని గయా జిల్లా సొంధియా గ్రామానికి చెందిన ఓ వైద్యుడు గయలోని గురార్ బజార్‌లో వైద్యునిగా పనిచేస్తున్నాడు.. నిన్న రాత్రి క్లినిక్‌ను మూసేసి భార్య, కుమార్తెతో కలిసి బైక్‌పై ఇంటికి బయలుదేరారు.. ఈ సమయంలో సోంధియా గ్రామం సమీపంలో రాత్రి  ఎనిమిది గంటల ప్రాంతంలో మారణాయుధాలు కలిగిన 20 మంది దుండగులు వారిని చుట్టుముట్టారు..

తన భార్య, కుమార్తెపై అత్యాచారానికి పాల్పడతారని గ్రహించిన అతను .. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.. దీంతో దుండగులు ఆయన్ను చెట్టుకు కట్టేసి.. తుపాకిని గురిపెట్టి అతని కళ్లెదుటే తల్లీకూతుళ్లపై 20 మంది అత్యాచారం జరిపి పొలాల్లో పడేసి పారిపోయారు.. అటుగా వెళ్తున్న కొందరు గ్రామస్తులు.. వీరి అరుపులు విని పోలీసులకు సమాచారం అందించారు.. రంగంలోకి దిగిన పోలీసులు కొందరు దుండగుల్ని బాధితుల ముందు నిలబెట్టగా తల్లీ ఇద్దరిని గుర్తుపట్టింది.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులందరిని అదుపులోకి తీసుకున్నారు..  తల్లీకూతుళ్లను వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
 

loader