నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Monday 3rd October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...
 
5:01 PM IST

నేడు భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (సోమవారం) నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 56,788 వద్దకు చేరుకోగా నిప్టీ 207 పాయింట్లు నష్టపోయి 16,887కి దిగజారింది. 

3:48 PM IST

స్వీడన్ కు చెందిన స్వంటే పాబేకు వైద్యరంగంలో నోబెల్

వైద్య రంగానికి అందించిన అత్యుత్తమ సేవలకు గాను స్వీడన్ కు చెందిన స్వంటే పాబేకు నోబెల్ బహుమతి లభించింది. 
 
2:50 PM IST

ములాయం ఆరోగ్య పరిస్థితిపై కేసీఆర్ ఆరా... అఖిలేష్ కు ఫోన్

ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతతో ఐసియులో చికిత్స పొందుతున్ననేపథ్యంలో ఆయన పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీసారు. ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసిన కేసీఆర్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ కు ధైర్యం చెప్పిన కేసీఆర్ దసరా తర్వాత పరామర్శకు వస్తానని తెలిపినట్లు సమాచారం. 
 
1:57 PM IST

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం... ఒకరు మృతి, 67మందికి గాయాలు

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పరిమితికి మించిన ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సు ఉదంపూర్ జిల్లాలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 67 మంది గాయపడ్డారు. 

12:32 PM IST

మునుగోడు ఉపఎన్నికకు ఈసి షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాజకీయ వేడి పుట్టించిన మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ  నెల 7వ తేదీన నోటిఫికేషన్, 14 వరకు నామినేషన్ల స్వీకరణ, 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న కౌంటింగ్ చేపట్టి తుది పలితం వెల్లడించనున్నట్లు ఈసి ప్రకటించింది. 

Read More  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..
 
12:06 PM IST

బిసిసిఐ సెలెక్టర్లపై యువ క్రికెటర్ అసహనం... పరోక్షంగా చురకలు

బిసిసిఐ, టీమిండియా సెలెక్షన్ కమిటీ తీరుపై యువ క్రికెటర్ పృథ్వి షా తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సీరిస్ కోసం ప్రకటించిన జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో షా తీవ్రంగా స్సందించారు. వారు చెప్పే మాటలు కాదు... వారి చర్యలనే విశ్వసించాలంటూ పరోక్షంగా సెలక్టర్లకు చురకలు అంటించారు. 

11:04 AM IST

చిలకలూరిపేట కిడ్నాప్... బాలున్ని సురక్షితంగా కాపాడిన పోలీసులు

పల్నాడు జిల్లా చిలకటూరిపేట బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యింది. కావలి దగ్గర కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలున్ని సురక్షితంగా కాపాడారు. 
 
10:29 AM IST

మహారాష్ట్రలో భారీగా పట్టుబడ్డ నగదు, బంగారం... రైల్వే ప్యాసింజర్ అరెస్ట్

రైల్వే ప్లాట్ ఫాం పై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ ప్యాసింజర్ నుండి రూ.1.71 కోట్ల సొత్తును ఆర్పిఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని తిత్వాల రైల్వేస్టేషన్ చోటుచేసుకుంది. ఎలాంటి పత్రాలు లేకుండానే రూ.56 లక్షల నగదుతో పాటు కోటి రూపాయలకు పైగా విలువైన రెండు గోల్డ్ బిస్కెట్లను తరలిస్తున్న ప్యాసింజర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుండి స్వాదీనం చేసుకున్న సొత్తును ఆదాయపన్ను అధికారులకు రైల్వే సిబ్బంది అప్పగించారు. 

9:40 AM IST

చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్... కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. రాజీవ్ సాయి (8) అనే బాలున్ని దేవాలయం వద్దనుండి కిడ్నాప్ చేసిన దుండగులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలుడిని కిడ్నాపర్ల చెరనుండి సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. 

9:33 AM IST

ఐసియూలో ములాయం సింగ్... అఖిలేష్ కు మోదీ, యోగి ఫోన్

ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ తీవ్ర అనారోగ్యంతో గురుగ్రామ్ లోని మేదాంత హాస్పిటల్ ఐసియూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీసారు. ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ తో మాట్లాడిన వీరు తమ తరపున ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. యూపీ సీఎం డాక్టర్లతో మాట్లాడి ములాయంకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. 
 
5:01 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ (సోమవారం) నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 638 పాయింట్లు నష్టపోయి 56,788 వద్దకు చేరుకోగా నిప్టీ 207 పాయింట్లు నష్టపోయి 16,887కి దిగజారింది. 

3:48 PM IST:

వైద్య రంగానికి అందించిన అత్యుత్తమ సేవలకు గాను స్వీడన్ కు చెందిన స్వంటే పాబేకు నోబెల్ బహుమతి లభించింది. 
 
2:50 PM IST:

ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయంసింగ్ యాదవ్ తీవ్ర అస్వస్థతతో ఐసియులో చికిత్స పొందుతున్ననేపథ్యంలో ఆయన పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీసారు. ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కు ఫోన్ చేసిన కేసీఆర్ తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలేష్ కు ధైర్యం చెప్పిన కేసీఆర్ దసరా తర్వాత పరామర్శకు వస్తానని తెలిపినట్లు సమాచారం. 
 
1:57 PM IST:

జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పరిమితికి మించిన ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ బస్సు ఉదంపూర్ జిల్లాలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా 67 మంది గాయపడ్డారు. 

12:33 PM IST:

తెలంగాణ రాజకీయ వేడి పుట్టించిన మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమీషన్ షెడ్యూల్ విడుదల చేసింది.  ఈ  నెల 7వ తేదీన నోటిఫికేషన్, 14 వరకు నామినేషన్ల స్వీకరణ, 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ, నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న కౌంటింగ్ చేపట్టి తుది పలితం వెల్లడించనున్నట్లు ఈసి ప్రకటించింది. 

Read More  మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్.. పూర్తి వివరాలు ఇవే..
 
12:06 PM IST:

బిసిసిఐ, టీమిండియా సెలెక్షన్ కమిటీ తీరుపై యువ క్రికెటర్ పృథ్వి షా తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సీరిస్ కోసం ప్రకటించిన జట్టులో తనకు చోటు దక్కకపోవడంతో షా తీవ్రంగా స్సందించారు. వారు చెప్పే మాటలు కాదు... వారి చర్యలనే విశ్వసించాలంటూ పరోక్షంగా సెలక్టర్లకు చురకలు అంటించారు. 

11:04 AM IST:

పల్నాడు జిల్లా చిలకటూరిపేట బాలుడి కిడ్నాప్ వ్యవహారం సుఖాంతమయ్యింది. కావలి దగ్గర కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాలున్ని సురక్షితంగా కాపాడారు. 
 
10:29 AM IST:

రైల్వే ప్లాట్ ఫాం పై అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఓ ప్యాసింజర్ నుండి రూ.1.71 కోట్ల సొత్తును ఆర్పిఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర థానే జిల్లాలోని తిత్వాల రైల్వేస్టేషన్ చోటుచేసుకుంది. ఎలాంటి పత్రాలు లేకుండానే రూ.56 లక్షల నగదుతో పాటు కోటి రూపాయలకు పైగా విలువైన రెండు గోల్డ్ బిస్కెట్లను తరలిస్తున్న ప్యాసింజర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుండి స్వాదీనం చేసుకున్న సొత్తును ఆదాయపన్ను అధికారులకు రైల్వే సిబ్బంది అప్పగించారు. 

9:40 AM IST:

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. రాజీవ్ సాయి (8) అనే బాలున్ని దేవాలయం వద్దనుండి కిడ్నాప్ చేసిన దుండగులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలుడిని కిడ్నాపర్ల చెరనుండి సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. 

9:33 AM IST: