నేటి వార్తా ముఖ్యాంశాలివే..

Monday 31st October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

4:14 PM IST

ఆగని రూపాయి పతనం... యూఎస్ డాలర్ తో పోలిస్తే రూ.82.78

అంతర్జాతీయ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తాజాగా మరో 30 పైసలు క్షీణించి రూ. 82.78 వద్ద నిలిచింది. 
 
3:26 PM IST

ఎన్సిపి అధినేత పవార్ కు అస్వస్థత... హుటాహుటిన హాస్పిటల్ కు

మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎన్సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధ్యక్షుడు శరద్ పవార్ హాస్పిటల్లో చేరారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లు ... పార్టీ శ్రేణులు కంగారుపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. నవంబర్ 3న జరిగే పార్టీ సమావేశానికి శరద్ పవార్ హాజరవుతారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శివాజీరావ్ తెలిపారు. 

2:12 PM IST

గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ప్రమాదం ... రేపు ఘటనాస్థలికి ప్రధాని మోదీ

గుజరాత్ మోర్బీ తీగల వంతెన కుప్పకూలిన ఘటన మారణహోమం సృష్టించింది. ఈ దుర్ఘటనపై ఇప్పటికే స్పందించి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని రేపు(మంగళవారం) మధ్యాహ్నం ఘటనాస్థలిని పరిశీలించనున్నారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 

1:07 PM IST

ఆదిలాబాద్ లో ఘోర రోడ్డుప్రమాదం... నలుగురు మృతి, ఒకరి పరిస్థితి విషమం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్  మండలం సీతగొంది వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది. 
 
12:00 PM IST

రాహుల్ గాంధీ పాదయాత్ర... హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. భారత్ జోడో యాత్ర హైదరాబాద్ మీదుగా కొనసాగినన్ని రోజులు ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని... కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా వుండాలని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

10:50 AM IST

సూపర్ మండే ... భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం  సెన్సెక్స్ 577 పాయింట్లు లాభపడి 60వేల మార్క్ ను దాటి 60,547 వద్ద కొనసాగుతోంది. నిప్టీ 164 పాయింట్లు లాభపడి 17,951 వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
10:17 AM IST

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం ... ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని

సొంతరాష్ట్రం గుజరాత్ లో మోర్చి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు జాతీయ సహాయనిధి నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రధాని. 

9:32 AM IST

గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం... 141కి చేరిన మృతుల సంఖ్య

గుజరాత్ లోని మోర్చీ పట్టణంలో మచ్చు నదిపై గల పురాతన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మ‌ృతుల సంఖ్య క్షణక్షణాన మరింత పెరుగుతోంది. వంతెన కూలిన సమయంలో 500 మంది దానిపై వున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు 141మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. నదిలో పడి గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. 
 
9:20 AM IST

సర్దార్ పటేల్ జయంతి... ప్రధాని మోదీ ఘన నివాళి

స్వాతంత్య్ర భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని స్టాట్యూ ఆఫ్ యూనిటి వద్ద జరిగే పటేల్ జయంతి వేడుకల్లో పీఎం పాల్గొననున్నారు. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు కూడా పటేల్ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ప్రభుత్వం జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుతున్న విషయం తెలిసిందే. 

4:14 PM IST:

అంతర్జాతీయ మార్కెట్ లో భారత కరెన్సీ రూపాయి పతనం కొనసాగుతోంది. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ తాజాగా మరో 30 పైసలు క్షీణించి రూ. 82.78 వద్ద నిలిచింది. 
 
3:26 PM IST:

మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎన్సిపి (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) అధ్యక్షుడు శరద్ పవార్ హాస్పిటల్లో చేరారు. స్వల్ప అనారోగ్యంతో ఆయన ముంబైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరినట్లు ... పార్టీ శ్రేణులు కంగారుపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. నవంబర్ 3న జరిగే పార్టీ సమావేశానికి శరద్ పవార్ హాజరవుతారని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ శివాజీరావ్ తెలిపారు. 

2:12 PM IST:

గుజరాత్ మోర్బీ తీగల వంతెన కుప్పకూలిన ఘటన మారణహోమం సృష్టించింది. ఈ దుర్ఘటనపై ఇప్పటికే స్పందించి ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని రేపు(మంగళవారం) మధ్యాహ్నం ఘటనాస్థలిని పరిశీలించనున్నారు. ఈ మేరకు గుజరాత్ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. 

1:07 PM IST:

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్  మండలం సీతగొంది వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారును కంటైనర్ ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు ప్రాణాలు కోల్పోగా ఒకరి పరిస్థితి విషమంగా వుంది. 
 
12:00 PM IST:

రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. భారత్ జోడో యాత్ర హైదరాబాద్ మీదుగా కొనసాగినన్ని రోజులు ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని... కాబట్టి వాహనదారులు అప్రమత్తంగా వుండాలని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 

10:50 AM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం  సెన్సెక్స్ 577 పాయింట్లు లాభపడి 60వేల మార్క్ ను దాటి 60,547 వద్ద కొనసాగుతోంది. నిప్టీ 164 పాయింట్లు లాభపడి 17,951 వద్ద ట్రేడ్ అవుతోంది. 
 
10:17 AM IST:

సొంతరాష్ట్రం గుజరాత్ లో మోర్చి కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. వెంటనే ప్రమాదంలో మృతిచెందినవారి కుటుంబాలకు జాతీయ సహాయనిధి నుండి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు ప్రధాని. 

9:32 AM IST:

గుజరాత్ లోని మోర్చీ పట్టణంలో మచ్చు నదిపై గల పురాతన కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో మ‌ృతుల సంఖ్య క్షణక్షణాన మరింత పెరుగుతోంది. వంతెన కూలిన సమయంలో 500 మంది దానిపై వున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు 141మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. మరో 177 మందిని సహాయక సిబ్బంది కాపాడారు. నదిలో పడి గల్లంతయిన వారికోసం గాలింపు చేపట్టారు. 
 
9:26 AM IST: