నేటి వార్తా ముఖ్యాంశాలివే..!

Monday 19th september news updates

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

4:20 PM IST

దేశీయ స్టాక్ మార్కెట్స్ జోరు... సోమవారమూ లాభాలతోనే ముగింపు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాలతో ముగిసాయి. గత రెండ్రోజుల లాభాల పయనాన్ని కొనసాగిస్తూ సోమవారం కూడా సెన్సెక్స్ 300 పాయింట్లు, నిప్టీ 91 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో నిప్టీ 59,141 వద్ద, నిప్టి 17,622 వద్ద ముగిసాయి. 

3:14 PM IST

ఏపీ అసెంబ్లీ నుండి టిడిపి ఎమ్మెల్యేల సస్పెండ్

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగిన టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. మూడో రోజయిన ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో చర్చించారు. ఈ సమయంలో సభలోనే ఆందోళనకు దిగిన టిడిపి సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం జగన్ వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. దీంతో వెంటనే స్పీకర్ టిడిపి సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 
  
2:47 PM IST

పార్థ చటర్జీకి ఈడీ మరో షాక్... రూ.46 కోట్ల ఆస్తులు అటాచ్

ఉపాధ్యాయ నియామకాల స్కాంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీకి ఈడీ మరో షాకిచ్చింది. మాజీ మంత్రితో పాటు అతడి సన్నిహితురాలు అర్ఫిత ముఖర్జీకి చెందిన 46.22 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలా అటాచ్ చేసిన ఆస్తుల్లో విలాసవంతమైన ప్లాట్స్, ఫార్మ్ హౌస్ వంటి విలువైనవి వున్నట్లు ఈడీ తెలిపింది. 
 
1:46 PM IST

హైదరాబాద్ లో మళ్ళీ ఈడీ సోదాలు... ఐటీ, రియల్ ఎస్టేట్ కంపనీలే టార్గెట్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు ఐటీ, రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలపై  ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సోదాలు మొదలయ్యాయి.  డిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారుల బృందం 3 ఐటి కంపెనీలు, 2 రియల్ ఎస్టేట్ ఆఫిసుల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.  
 
12:48 PM IST

డైరెక్ట్ తెలుగులోనే ధనుష్ 'సార్'... రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ నేరుగా తెలుగులో నటిస్తున్న ''సార్''  సినిమా డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సంయుక్త మీనన్ హీరోయిగా ఈ సినిమా రూపొందుతోంది.  

Read More Dhanush : తమిళ హీరో ధనుష్ ‘సార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫిషియల్ అనౌన్స్ మెంట్
 
11:50 AM IST

మాజీ మంత్రి జోగు రామన్న ఇంట విషాదం..

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఇంట విషాదం చోటుచేసుకుంది. రామన్న మాతృమూర్తి భోజమ్మ మృతిచెందారు. జోగు రామన్న తల్లి మృతికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  సంతాపం వ్యక్తం చేశారు.  
 
11:13 AM IST

నేడు ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమావేశం వాయిదా...

ఇవాళ వైసిపి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరపాలని నిర్ణయించిన మీటింగ్ వాయిదా పడింది. సోమవారం కాకుండా మంగళవారం (రేపు) ఎమ్మెల్యేలతో సమావేశం సీఎం సమావేశమవనున్నట్లు ప్రకటించారు. 

10:37 AM IST

దేశంలో కొత్తగా 4,735 కరోనా కేసులు

భారత్ లో రోజువారి కరోనా కేసుల సంఖ్య ఐదు వేల దిగువకు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 4,735 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 48,027 కు చేరింది.  

9:56 AM IST

ఎడ్లబళ్లతో అసెంబ్లీకి... లోకేష్, పోలీసుల మధ్య వాగ్వాదం

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దమైన టిడిపి శాసనసబా పక్షం వినూత్నంగా ఎడ్లబళ్లతో ర్యాలీగా అసెంబ్లీవైపు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఎడ్లబళ్లను తీసుకువెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

9:47 AM IST

బిజెపి గూటికి పంజాబ్ మాజీ సీఎం అమరీందర్

పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ నేడు బిజెపిలో చేరనున్నారు. గతేడాది సరిగ్గా ఇదే నెలలో సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ కాంగ్రెస్ ను వీడారు.  ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగా ఓ పార్టీని ఏర్పాటుచేసి పోటీచేసారు. ఈ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత తాజాగా బిజెపిలో చేరేందుకు సిద్దమయ్యారు. బిజెపి జాతీయాధ్యక్షులు జెపి నడ్డా సమక్షంలో అమరీందర్  బిజెపిలో చేరనున్నారు. 
 
4:20 PM IST:

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా లాభాలతో ముగిసాయి. గత రెండ్రోజుల లాభాల పయనాన్ని కొనసాగిస్తూ సోమవారం కూడా సెన్సెక్స్ 300 పాయింట్లు, నిప్టీ 91 పాయింట్లు లాభపడ్డాయి. దీంతో నిప్టీ 59,141 వద్ద, నిప్టి 17,622 వద్ద ముగిసాయి. 

3:14 PM IST:

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనకు దిగిన టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేసారు. మూడో రోజయిన ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో చర్చించారు. ఈ సమయంలో సభలోనే ఆందోళనకు దిగిన టిడిపి సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన సీఎం జగన్ వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ ను కోరారు. దీంతో వెంటనే స్పీకర్ టిడిపి సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. 
  
2:47 PM IST:

ఉపాధ్యాయ నియామకాల స్కాంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీకి ఈడీ మరో షాకిచ్చింది. మాజీ మంత్రితో పాటు అతడి సన్నిహితురాలు అర్ఫిత ముఖర్జీకి చెందిన 46.22 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇలా అటాచ్ చేసిన ఆస్తుల్లో విలాసవంతమైన ప్లాట్స్, ఫార్మ్ హౌస్ వంటి విలువైనవి వున్నట్లు ఈడీ తెలిపింది. 
 
1:46 PM IST:

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో పలు ఐటీ, రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాలపై  ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) సోదాలు మొదలయ్యాయి.  డిల్లీ నుండి వచ్చిన ఈడీ అధికారుల బృందం 3 ఐటి కంపెనీలు, 2 రియల్ ఎస్టేట్ ఆఫిసుల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.  
 
12:50 PM IST:

తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ నేరుగా తెలుగులో నటిస్తున్న ''సార్''  సినిమా డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సంయుక్త మీనన్ హీరోయిగా ఈ సినిమా రూపొందుతోంది.  

Read More Dhanush : తమిళ హీరో ధనుష్ ‘సార్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. అఫిషియల్ అనౌన్స్ మెంట్
 
11:50 AM IST:

ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఇంట విషాదం చోటుచేసుకుంది. రామన్న మాతృమూర్తి భోజమ్మ మృతిచెందారు. జోగు రామన్న తల్లి మృతికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  సంతాపం వ్యక్తం చేశారు.  
 
11:13 AM IST:

ఇవాళ వైసిపి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరపాలని నిర్ణయించిన మీటింగ్ వాయిదా పడింది. సోమవారం కాకుండా మంగళవారం (రేపు) ఎమ్మెల్యేలతో సమావేశం సీఎం సమావేశమవనున్నట్లు ప్రకటించారు. 

10:37 AM IST:

భారత్ లో రోజువారి కరోనా కేసుల సంఖ్య ఐదు వేల దిగువకు చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కేవలం 4,735 కొత్తకేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 48,027 కు చేరింది.  

9:56 AM IST:

ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్దమైన టిడిపి శాసనసబా పక్షం వినూత్నంగా ఎడ్లబళ్లతో ర్యాలీగా అసెంబ్లీవైపు వెళ్లారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఎడ్లబళ్లను తీసుకువెళ్లడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  

9:47 AM IST: