నేటి వార్తల్లోని ముఖ్యాంశాలివే

Monday 17th October Telugu News Live

తెలుగు రాష్ట్రాల్లోని తాజా వార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, క్రీడా, సినీ, క్రైమ్, బిజినెస్ వార్తలను ఎప్పటికప్పుడు ఏషియానెట్ తెలుగు లైవ్ అఫ్ డేట్స్ ద్వారా అందిస్తున్నాం. జస్ట్ వన్ క్లిక్‌తో నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మీ కోసం...

3:35 PM IST

టీఆర్ఎస్ ఎంపీ నామా ఈడీ షాక్ ... రూ.80 కోట్ల ఆస్తులు జప్తు

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నికలకు ముందు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరడానికి సిద్దమవగా తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావును ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) టార్గెట్ చేసింది. ఇప్పటికే అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారించి రూ.67కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ తాజాగా మరోరూ.80 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మధుకాన్ ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్ తో సహా ఈ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. 
 
2:51 PM IST

ఐసిసి చీఫ్ పదవి పోటీకి గంగూలీని అనుమతించండి : మోదీని కోరిన మమతా బెనర్జీ

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి పదవి దక్కకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఛైర్మన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని మోదీని కోరారు బెంగాల్ సీఎం.  
 
1:52 PM IST

మునుగోడు ప్రచారంలో పాల్గొనను... ఆ ఎస్పీ కాంగ్రెస్ గెలిస్తాడేమో చూద్దాం..: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం తాను పాల్గొనడంలేదని కాంంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా గతంలో టిపిసిసి చీఫ్ రేవంత్ సీనియర్లను హోంగార్డులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి గుర్తుచేసుకున్నారు.  తనలాంటి హోంగార్డుల ప్రచారం కాంగ్రెస్ కు అవసరం లేదని... ఎస్పీ స్థాయి ఐపిఎస్ అక్కడ ప్రచారానికి వెళతారని... ఆయనే మునుగోడులో పార్టీని గెలిపిస్తాడంటూ రేవంత్ పై కోమటిరెడ్డి విమర్శలు చేసారు. 

1:02 PM IST

ప్రశాంతంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ... ఓటేసిన సోనియా, రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ న్యూడిల్లీలో తనయుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక అధ్యక్ష అభ్యర్ధులు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ కూడా ఓటేసారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మధ్య ప్రదేశ్ పిసిసి చీఫ్ కమల్ నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్ తదితరులు కూడా ఇప్పటికే ఓటేసారు. 

11:39 AM IST

డిల్లీ లిక్కర్ స్కామ్ ... సిబిఐ విచారణకు డిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా

డిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానపాత్ర పోషించారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం ఇంటినుండి నేరుగా రాజ్ ఘాట్ కు చేరకున్న సిసోడియా ఆ తర్వాత ఆప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడినుండి కొద్దిసేపటి క్రితమే సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. 

10:51 AM IST

మెక్సికోలో దుండుగుల కాల్పులు... 12మంది మృతి

మెక్సికోలోని ఓ బార్ లోకి మారణాయుధాలతో ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగడంతో 12మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

9:58 AM IST

జగిత్యాల జిల్లాలో విషాదం... యువ సర్పంచ్ ఆత్మహత్య

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ రణధీర్ గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న వయసులోని సర్పంచ్ గా ఎన్నికైన అతడి మృతితో కుటుంబంలోనే కాదు గ్రామంలోనూ విషాదం అలుముకుంది. సర్పంచ్ రణధీర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

9:21 AM IST

పంజాబ్ సీఎం భగవంత్ మన్ కు ప్రధాని మోదీ విషెస్

సొంతరాష్ట్రం గుజరాత్ లో బిజెపిని ఓడించి తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్విట్టర్ వేదికన పంజాబ్ సీఎంకు విషెస్ తెలిపారు. 
 
9:15 AM IST

నేడే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష (ఏఐసిసి) ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ నేడు(సోమవారం) జరగనుంది. ఇప్పటికే ఈ ఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగగా సుధీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ముందుడి నడిపించే నాయకుడెవరో 9వేలమంది ప్రతినిధులు నిర్ణయించనున్నారు. దేశవ్యాప్తంగా 65 పోలింగ్ బూత్ లను ఏర్పాటుచేసారు. అధ్యక్ష బరిలో సీనియర్ల మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ నిలిచారు. 

3:35 PM IST:

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి మునుగోడు ఉపఎన్నికలకు ముందు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరడానికి సిద్దమవగా తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావును ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) టార్గెట్ చేసింది. ఇప్పటికే అక్రమాలకు పాల్పడినట్లు నిర్దారించి రూ.67కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ తాజాగా మరోరూ.80 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మధుకాన్ ప్రాజెక్ట్ హెడ్ ఆఫీస్ తో సహా ఈ సంస్థకు చెందిన 28 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. 
 
2:51 PM IST:

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీకి రెండోసారి పదవి దక్కకపోవడం దిగ్భ్రాంతికి గురిచేసిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఛైర్మన్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సౌరవ్ గంగూలీని అనుమతించాలని ప్రధాని మోదీని కోరారు బెంగాల్ సీఎం.  
 
1:52 PM IST:

మునుగోడు ఉపఎన్నికల ప్రచారం తాను పాల్గొనడంలేదని కాంంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా గతంలో టిపిసిసి చీఫ్ రేవంత్ సీనియర్లను హోంగార్డులతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి గుర్తుచేసుకున్నారు.  తనలాంటి హోంగార్డుల ప్రచారం కాంగ్రెస్ కు అవసరం లేదని... ఎస్పీ స్థాయి ఐపిఎస్ అక్కడ ప్రచారానికి వెళతారని... ఆయనే మునుగోడులో పార్టీని గెలిపిస్తాడంటూ రేవంత్ పై కోమటిరెడ్డి విమర్శలు చేసారు. 

1:02 PM IST:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కూతురు ప్రియాంక గాంధీ న్యూడిల్లీలో తనయుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇక అధ్యక్ష అభ్యర్ధులు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ కూడా ఓటేసారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మధ్య ప్రదేశ్ పిసిసి చీఫ్ కమల్ నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక పిసిసి చీఫ్ డికే శివకుమార్ తదితరులు కూడా ఇప్పటికే ఓటేసారు. 

11:39 AM IST:

డిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానపాత్ర పోషించారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న డిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సిబిఐ విచారణకు హాజరయ్యారు. ఇవాళ ఉదయం ఇంటినుండి నేరుగా రాజ్ ఘాట్ కు చేరకున్న సిసోడియా ఆ తర్వాత ఆప్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడినుండి కొద్దిసేపటి క్రితమే సిబిఐ కార్యాలయానికి చేరుకున్నారు. 

10:50 AM IST:

మెక్సికోలోని ఓ బార్ లోకి మారణాయుధాలతో ప్రవేశించిన గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు దిగడంతో 12మంది మృత్యువాతపడ్డారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

9:58 AM IST:

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. సర్పంచ్ రణధీర్ గ్రామ శివారులోని మామిడి తోటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్న వయసులోని సర్పంచ్ గా ఎన్నికైన అతడి మృతితో కుటుంబంలోనే కాదు గ్రామంలోనూ విషాదం అలుముకుంది. సర్పంచ్ రణధీర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. 

9:21 AM IST:

సొంతరాష్ట్రం గుజరాత్ లో బిజెపిని ఓడించి తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్న ఆప్ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని... సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నానంటూ ప్రధాని ట్విట్టర్ వేదికన పంజాబ్ సీఎంకు విషెస్ తెలిపారు. 
 
9:15 AM IST: