ప్రముఖ హీరో కుమారుడు మద్యం తాగించి రేప్ చేశాడు

Mithun Chakraborty's Son Mahaakshay Accused Of Rape
Highlights

బాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మిథున్ చక్రవర్తిని వివాదాలు చుట్టుముట్టాయి.

న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు మిథున్ చక్రవర్తిని వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన భార్య యోగితా బాలి, కుమారుడి మహాక్షయ్ చక్రవర్తిలపై చీటింగ్, రేప్ కేసు నమోదైంది. 

వారిద్దరిపై కేసు నమోదు చేయాల్సిందిగా రోహిణీ కోర్టు ఆదేశాల జారీ చేసింది. మహాక్షయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోరుతూ బాధిత యువతి కోర్టును ఆశ్రయించింది. దాంతో కోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది.
 
ఏప్రిల్ 2015 నుంచి మహాక్షయ్‌‌తో తనకు సంబంధం ఉందని, ఇద్దరం ఫోన్, చాటింగ్ ల ద్వారా ప్రతి రోజూ మాట్లాడుకునే వాళ్లమని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పింది. ఒక రోజు తన ఫ్లాట్‌కు పిలిచాడని, వెళ్లిన తనకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. 

ఇదిలావుంటే, తన కుమారుడితో సంబంధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని యోగితా బాలి బెదిరించినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. యోగితా బాలి, మహాక్షయ్ బెదిరించడంతో ప్రాణాలకు భయపడి తాను ముంబై నుంచి ఢిల్లీకి మారినట్లు తెలిపింది. 

ఆ త ర్వాత పెళ్లి పేరుతో తనపై అత్యాచారానికి పాల్పడుతూనే ఉన్నాడని తెలిపింది. అతడి వల్ల తాను గర్భం దాల్చడంతో తనకు కొన్ని మందులు ఇచ్చాడని, వాటిని వేసుకున్నాక గర్భస్రావం జరిగిందని తెలిపింది. తన కెరీర్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ పనిచేశాడని ఆరోపించింది.

loader