చెన్నై: తమిళనాడులో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఐదు నెలల క్రితం అదృశ్యమైన 15 ఏళ్ల పాఠశాల విద్యార్థిని కేసులో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. స్కూల్ యూనిఫాంలో పాఠశాల ఆవరణలోనే సమాధి అయిన బాలిక అస్తిపంజరాన్ని పోలీసులు వెలికి తీశారు. 

తిరుత్తణి సమీపంలోని వెంకటాపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్లు తేలింది. బాలికను కిడ్నాప్ చేసి మామిడి తోటలోని మోటార్ పంపు రూంలో నిర్బంధించినట్లు, ఆమెపై ఐదుగురు ఐదు రోజుల పాటు అత్యాచారం చేసినట్లు పోలీసులు కనిపెట్టారు. 

ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాలిక ఐదు నెలల క్రితం అదృశ్యమైంది. అయితే, బాలిక ప్రియుడితో లేచిపోయి ఉంటుందని కుటుంబ సభ్యులు భావించడంతో పోలీసులు కేసును మూసేశారు. 

పంచదార క్షేత్రంలో పనిచేస్తున్న కొందరికి అస్తిపంజరం కనిపించింది. దీంతో తిరువల్లూరు జిల్లా ఎస్పీ పొన్ని కేసు రీఓపెన్ కు ఆదేశాలు జారీ చేశారు. కేసును ఛేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. 

ఈ కేసులో పోలీసులు ప్రధాన నిందితుడు శంకరయ్యను అదుపులోకి తీసుకుని సీన్ రిక్రియేట్ చేశారు. నిర్బంధించినప్పుడు బాలిక కట్టేసి అరుపులు బయటకు వినిపించకుండా నోటికి ప్లాస్టర్ వేసినట్లు అతను చెప్పాడు. తనతో రావడానికి బాలిక ఇష్టపడకపోవడంతో అతను ఆమెపై కోపం పెంచుకున్నాడు. 

పాఠశాలకు వెళ్తూ మధ్యలో సెప్టెంబర్ 7వ తేదీన పాలు ఇవ్వడానికి బాలిక మామిడితోటలోని భాస్కర్ అనే వ్యక్తి వద్దకు వెళ్లింది. ఆ సమయంలో శంకరయ్య బాలికను బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటనను చూసి ఫామ్ యజమాని నాథముని (50), అతని స్నేహితుడు కృష్ణమూర్తి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను సమీపంలోని మోటార్ పంప్ గదికి తీసుకుని వెళ్లి అక్కడ నిర్బంధించి ఐదు రోజుల పాటు అత్యాచారం చేశారు 

ఈ ఐదు రోజుల వ్యవధిలోనే శంకరయ్య తన ఇద్దరు మిత్రులను పిలిచాడు. వారు కూడా ఆమెపై అత్యాచారం చేశారు. ఐదు రోజుల పాటు అత్యాచారం చేసిన తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు చెబుతుందనే భయంతో వారు ఆమెను చంపేశారు. 

ఎవరికీ చెప్పవద్దని శంకరయ్యకు ఇతర నిందితులు రూ.4 వేల ఇచ్చారు. శవాన్ని కాలువ ఒడ్డున సమాధి చేశారు. కాలువ ఒడ్డును బాలిక అస్తిపంజరం బయటపడింది. దాంతో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.