న్యూఢిల్లీ:  భారత వైమానిక దళానికి చెందిన ఐఎఎఫ్ ఎఎన్-32 విమానం తప్పిపోయిన విమానం గురించిన సమాచారం ఇంతవరకు లభ్యం కాలేదు.ఈ విమానం కోసం భారత వైమానిక దళం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ఓ ఆసక్తికర ఘటన వెలుగు చూసింది.

ఈ నెల 3వ తేదీన అస్సాంలోని జోహ్రట్ నుండి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన ఎఎన్-32 విమానం  ఏటీసీతో సంబంధాలను తెగదెంపులు చేసుకొంది. ఇప్పటివరకు ఈ విమానం ఆచూకీ లభ్యం కాలేదు. ఓ ఆంగ్ల దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.

అస్సాంలోని జోహ్రట్ నుండి ఐఎఎఫ్ ఎఎన్-32 విమానాన్ని ఆశిష్ అనే పైలెట్ నడిపాడు. ఈ విమానం ఈ నెల 3వ తేదీన మధ్యాహ్నం 12 గంటల25 టేకాఫ్ అయింది. ఆ సమయంలో ఈ విమానాన్ని నడిపే పైలెట్ ఆశిష్ భార్య సంద్య ఎయిర్ కంట్రోల్ రూమ్‌ను పర్యవేక్షిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మెంచుక బేస్ వైపు వెళ్తుండగా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విమానం రాడార్ నుండి అదృశ్యమైంది.

గంట సేపటి వరకు ఆశిష్ నడిపే విమానం ఆచూకీ దొరకకపోవడంతో సంధ్య ఈ విషయాన్ని ఆశిష్ చిన్నాన్న ఉదయ్ వీర్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పింది. గతేడాది ఫిబ్రవరిలోనే ఆశిష్, సంధ్యలకు వివాహం జరిగింది. అప్పటి నుంచి అస్సాంలోనే ఉంటున్నారు దంపతులు.

గత నెలలోనే హర్యానాలోని తమ కుటుంబీకులను ఈ దంపతులు కలిసి వెళ్లారు.  నాలుగు రోజులైనా ఈ విమానం ఆచూకీ లభ్యం కాకపోవడంతో  కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

బ్రేకింగ్: 13 మందితో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానం అదృశ్యం