కోల్‌కత్తా: కోల్‌కత్తాలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది  అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు పారిపోయాడు. మూడు రోజుల తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కోల్‌కత్తాలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఓ మైనర్ బాలికపై శనివారం సాయంత్రం అత్యాచారం జరిగింది. ఆర్మీ తూర్పు కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది. బాధితురాలి తండ్రి ఆర్మీ ఉద్యోగి. బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి ఆర్మీలో కిందిస్థాయి స్థాయి ఉద్యోగి. నిందితుడి నివాసం కోల్‌కతా ఫోర్ట్ విలియంలోని బాలిక ఇంటికి అతి సమీపంలోనే ఉంది.

అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత పారిపోయాడు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం నాడు ఈ ఘటన చోటు చేసుకొంటే మంగళవారం రాత్రి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఫోక్సో  చట్టం కింద అరెస్ట్ చేశారు. నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.