దారుణం:మైనర్ బాలికపై 7 నెలలుగా 15 మంది గ్యాంగ్ రేప్

Minor girl raped in Ayanavaram
Highlights

మైనర్ బాలికపై  సుమారు 15 మంది ఏడు మాసాలకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డారు.  కత్తితో బెదిరించి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు నివాసం ఉంటున్న  ప్రాంతానికి చెందిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారు.


చెన్నై:మైనర్ బాలికపై  సుమారు 15 మంది ఏడు మాసాలకు పైగా లైంగిక దాడికి పాల్పడ్డారు.  కత్తితో బెదిరించి ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు నివాసం ఉంటున్న  ప్రాంతానికి చెందిన వారే ఈ దారుణానికి పాల్పడ్డారు.ఏడు మాసాలకు పైగా బాధితురాలిపై 15 మందికిపైగా దుండగులు సాగించిన దారుణం ఎట్టకేలకు బయటకు వచ్చింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తరభారత దేశానికి  చెందిన ఓ కుటుంబం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో  నివాసం ఉంటుంది. ఈ ఏడాది జనవరి 15వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు  సుమారు 15 మంది దుండగులు  పలుమార్లు  గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.బాధితురాలునివాసం ఉండే  అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్ ఆపరేటర్  రవితో పాటు అతని ఇద్దరు సహాయకులు తొలుత  బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

అపార్ట్‌మెంట్‌లో జన సంచారం లేని ప్రాంతాలకు తీసుకెళ్లి ఆ బాలికపై నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు.  కొందరు నిందితులు బాధితురాలికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కూడ అత్యాచారానికి పాల్పడ్డారు. 

బాధితురాలు ఒప్పుకోని సమయాల్లో నిందితులు మెడపై కత్తిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి శరీరంపై కత్తిగాట్లు కూడ ఉన్నాయి. అయితే నెలల తరబడి తనపై లైంగిక దాడి జరుగుతున్న విషయాన్ని బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పలేదు.

అయితే కడుపునొప్పిగా ఉందని బాధితురాలు కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో ఆసుపత్రికి వెళ్లగా  బాధితురాలిపై అత్యాచారం జరిగిన విషయం తేలింది. దీంతో బాధితురాలిని తల్లి నిలదీసింది. దీంతో బాధితురాలు తనపై నెలల తరబడి జరిగిన అత్యాచారానికి సంబంధించిన  విషయాన్ని చెప్పింది. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

loader