Asianet News TeluguAsianet News Telugu

అమ్మమ్మతో బయటకు వెళ్లిన చిన్నారిని ఎత్తుకెళ్లి...

 తనపై జరిగిన దాడిని చిన్నారి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు నిందితుల్లో ఒకకరు చిన్నారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... చిన్నారిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

Minor girl gangraped by three men in Mathura
Author
Hyderabad, First Published Jan 18, 2020, 12:42 PM IST

అభం శుభం తెలియని చిన్నారిపై ముగ్గురు కామాంధులు కన్నేశారు. అమ్మమ్మతో కలిసి బయటకు వెళ్లిన చిన్నారిని ఆమె చూడకుండా ఎత్తుకెళ్లి.. ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా... ముగ్గురు నిందితుల్లో ఒకరు సదరు బాలిక కుటుంబానికి కావాల్సిన వ్యక్తే కావడం గమనార్హం. ఈ దారుణ సంఘటన మథురలోని సూరిర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మథుర ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక శుక్రవారం ఉదయం తన అమ్మమ్మతో కలిసి బయటకు వెళ్లింది. పెద్దావిడ చూడని సమయంలో ఆ చిన్నారిని ముగ్గురు వ్యక్తులు ఎత్తుకెళ్లారు. అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్లి... ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని ఇంటికి సమీపంలో వదిలిపెట్టారు.

కాగా... తనపై జరిగిన దాడిని చిన్నారి తన తల్లిదండ్రులకు తెలియజేసింది. వెంటనే ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముగ్గురు నిందితుల్లో ఒకకరు చిన్నారికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... చిన్నారిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

Also Read మహిళ శవాన్ని కాల్చి మంచానికి కట్టేశారు: రేప్ అనుమానం...

శుక్రవారం రాత్రే చిన్నారిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకువెళ్లగా... అక్కడ వైద్యులు ఎవరూ లేకపోవడం గమనార్హం. దాదాపు ఆ గ్రామం నుంచి 70కిలోమీటర్లు ప్రయాణించినా.. ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో దొరకలేదు. దీంతో.. శనివారం ఉదయం చిన్నారినికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు పోలీసులు చెప్పారు.

నిందితులు చిన్నారిని మధ్యాహ్నం 2గంటల సమయంలో కిడ్నాప్ చేసి మళ్లీ సాయంత్రం 5గంటల సమయంలో ఇంటి వద్ద వదిలేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుల కోసం చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు గాలించినా దొరకలేదని.. వాళ్ల ద్విచక్రవాహనం మాత్రమే లభిందని చెప్పారు. నిందితుల్లో ఒకరు పవన్ గా గుర్తించారు. ముగ్గురు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు  చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios