Asianet News TeluguAsianet News Telugu

13ఏళ్ల బాలికపై ఏడుగురు మైనర్ల గ్యాంగ్ రేప్.. రంగంలోకి దిగిన పోలీసులు.. నలుగురు అరెస్ట్

జార్ఖండ్‌లో ఓ మైనర్ బాలికపై ఏడుగురు మైనర్ బాలురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. బాలికకు పరిచయమున్నవాడే ఆమెను బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ బాలుడి మరో ఆరుగురు మిత్రులు సిద్ధంగా ఉన్నారు. వారంతా కలిసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు విషయం ఇంట్లో తెలుపగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికి నలుగురు నిందితులను అరెస్టు చేసి జువెనైల్ హోమ్‌కు అప్పగించారు. మరో ముగ్గురిని గాలిస్తున్నారు.
 

minor girl gang raped by seven minors in jharkhand, four arrested, three accused absconding
Author
Ranchi, First Published Aug 29, 2021, 4:42 PM IST

రాంచీ: జార్ఖండ్‌లో ఘోరం జరిగింది. ఓ మైనర్ బాలికపై ఏడుగురు మైనర్ బాలురే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్టు చేసి జువెనైల్ హోమ్‌కు తరలించారు. మిగితా ముగ్గురి కోసం గాలింపులు చేపడుతున్నారు. రాంచీ జిల్లాకు సమీపంలోని మందర్ ఏరియాలో 26న ఈ ఘటన చోటుచేసుకుంది.

13ఏళ్ల బాలిక దగ్గరకు ఆమెకు తెలిసిన మిత్రుడే వచ్చాడు. తన మోటార్‌సైకిల్‌పై బయటకు తీసుకెళ్లాడు. మందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడికి చేరగానే ఆమెకు అనుమానాస్పదంగా తోచింది. వెంటనే తనను ఇంటి దగ్గర దింపాల్సిందిగా కోరింది. కానీ, ఆ బాలుడు అందుకు తిరస్కరించాడు. తనతో శారీరక సంబంధాన్ని పెట్టుకోవాల్సిందిగా అడిగాడు. ఇందుకు తిరస్కరించి ఆమె అక్కడి నుంచి పరుగెత్తడానికి ప్రయత్నించింది. ఆ బాలుడి మిత్రులు మరో ఆరుగురు మైనర్లు అక్కడ ముందుగానే అక్కడికి వచ్చి ఉన్నారు. వారంతా కలిసి బాలికను పరుగెత్తకుండా అడ్డుకున్నారు. బలవంతంగా ఆమెను తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గ్యాంగ్ రేప్‌కు పాల్పడినట్టు బాధితురాలు ఆరోపించింది.

గ్యాంగ్ రేప్ తర్వాత బాధితురాలిని ఆమె నిందిత మిత్రుడు తిరిగి ఊరిలోకి తీసుకెళ్లి బంధువు ఇంటిలో దింపాడు. ఆ రోజు రాత్రి అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం బాధితురాలు తన ఇంటికి వెళ్లింది. వెళ్లగానే తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పింది. వారు పరుగుపరుగున పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దూకారు. నలుగురు నిందిత మైనర్లను అరెస్టు చేశారు. వారిని జువైనెల్ హోమ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన ముగ్గురికోసం గాలింపులు ముమ్మరంగా చేపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios