చెన్నై:స్మార్ట్‌ పోన్ల కారణంగా లాభాలు ఎన్ని ఉన్నాయో...నష్టాలు కూడ  అన్నే ఉన్నాయి. స్మార్ట్‌పోన్లో  వ్యక్తిగత సమాచారాన్ని  సేకరించిన  ఓ యువకుడు పలువురు మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. మొబైల్‌ ఫోన్‌లో  ట్రాక్ వ్యూ యాప్ సహాయంతో  సుమారు 80 మంది మహిళల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి  వారిలో పలువురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తను లొంగని వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు.

తమిళనాడు రాష్ట్రంలోని  రామనాథపురం  జిల్లా పనైకులం ప్రాంతానికి చెందిన దినేష్ కుమార్  ఎంసీఏ చదివాడు. అక్కడే నివాసం ఉండే తన బంధువైన  ఓ మహిళ ఇంటికి విందుకు వెళ్లాడు.  అయితే  ఆమె భర్త విదేశాల్లో ఉంటాడు.  ఆమె కోసం భర్త విదేశాల నుండి ఓ కొత్త మొబైల్ ఫోన్ ను పంపాడు.

టెక్నాలజీ తెలిసిన  దినేష్‌కుమార్ ను  వాట్సాప్‌ వంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలని ఆమె కోరింది.  అయితే వాట్సాప్‌తో పాటు  ట్రాక్‌వ్యూ  అనే యాప్‌ను అతను ఆమె మొబైల్‌ ఫోన్‌లో  డౌన్‌లోడ్ చేశారు.  

ఈ యాప్ ద్వారా  ఆ మహిళ తన భర్తతో మాట్లాడే వ్యక్తిగత విషయాలు, ఫోటోలు, వీడియోలను సేకరించి తన ల్యాప్‌టాప్‌లో భద్రపరిచాడు. అయితే  వీటిని చూపి ఆమెను  బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.  తన లైంగిక వాంఛ తీర్చకపోతే  భర్తతో మాట్లాడిన ఆడియో రికార్డును  ఫోటోలు,  వీడియోలను  సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించాడు. 

ఈ విషయాన్ని ఆమె తన సోదరుడికి  చెప్పింది. దీంతో సోదరుడు  ఓ పథకాన్ని రచించాడు. ఏకాంతంగా కలుసుకొందామని  ఓ ప్రాంతానికి రావాల్సిందిగా  బాధితురాలి సెల్‌ నుండి మేసేజ్ పంపాడు.

అయితే ఆ ప్రాంతానికి దినేష్ రావడంతో బాధితురాలు ఆమె సోదరుడు షాక్ గురయ్యారు.  ఈ విషయాన్ని ముందే పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితులు దినేష్‌ను చితకబాది  పోలీసులకు అప్పగించారు. దినేష్  ఇచ్చిన సమాచారం మేరకు అతడి ఇంట్లో ఉన్న  రెండు ల్యాప్‌టాప్‌లు, మూడ సెల్‌ఫోన్లు, మహిళల దుస్తులను  స్వాధీనం చేసుకొన్నారు. తన బంధువులు, స్నేహితుల సెల్‌పోన్‌లు చూస్తున్నట్టుగా నటించి ఆ ఫోన్లనలో ట్రాక్ వ్యూ యాప్ డౌన్‌లోడ్ చేసేవాడు. 

ఈ యాప్ సహాయంతో  ఆయా ఫోన్ల నుండి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించేవాడు. ఈ ఫోటోలను విదేశీయులకు  విక్రయించినట్టు సమాచారం. మరో వైపు తనకు లొంగినవారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.ఈ యాప్ సహాయంతో  సుమారు 80 మంది మహిళల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించాడు. వారిలో చాలామందిపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు  గుర్తించారు.