మన ఊళ్లో కరువు పని చ్చిందంటే.. అది మన మన్మోహనుడి చలవే
భారతదేశ మాజీ ప్రధానమంత్రి , ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్, ప్రణాళిక సంఘం, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI), ఆర్థిక సలహాదారు వంటి అనేక కీలక పదవుల్లో పనిచేసి భారత అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించారు. ఆయన డిసెంబరు 26, 2024లో మరణించారు. ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ కి సంబంధించిన 19 ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు చూద్దాం.
- జననం: మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 26, 1932న పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్‌లో) జన్మించారు. భారత విభజన తరువాత, తన కుటుంబంతో కలసి భారత్‌కు వలస వచ్చారు.
- తల్లి మరణం: చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయిన సింగ్, తన అమ్మమ్మ చేతనే పెరిగారు.
- గ్రామ జీవనం: ఆయన పుట్టిన గ్రామంలో విద్యుత్ కూడా లేకపోవడంతో కిరోసిన్ దీపం వెలుగులో చదువుకుంటుండేవారు.
- విద్య: సింగ్ అమృతసర్‌లోని హిందూ కళాశాలలో చదివి, పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను పూర్తిచేశారు.
- ఉన్నత విద్య: ఆయన కెంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ ట్రిపాస్ పూర్తి చేసి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డి.ఫిల్ సాధించారు.
- UNCTAD: 1966 నుండి 1969 వరకు ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి సదస్సులో (UNCTAD) పనిచేశారు.
- వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారు: లలిత్ నారాయణ మిశ్రా చేత నియమించబడి వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా పనిచేశారు.
- ఆర్థిక మంత్రిత్వ శాఖ: 1972లో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా నియమితులయ్యారు.
- RBI గవర్నర్: 1982లో భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమించబడ్డారు.
- ప్రణాళిక సంఘం: 1985 నుండి 1987 వరకు ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా పని చేశారు.
- UGC ఛైర్మన్: 1991లో యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్‌గా నియమించబడ్డారు.
- ఆర్థిక మంత్రి: 1991లో పీవీ నరసింహారావు క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, భారత ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు.
- రాజ్యసభ: 1991లో రాజ్యసభకు ఎన్నికై, 1995, 2001, 2007, 2013లో తిరిగి ఎన్నికయ్యారు.
- ప్రధానమంత్రి: 2004 మే 22న మన్మోహన్ సింగ్ భారత్‌కు 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పుడే జాతీయ ఉపాధి హామీ అదేనండీ 100 రోజుల పని పథకం ప్రారంభించారు.
- 1987లో పద్మ విభూషణ అవార్డు.
- 1993లో "ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్" గా Euromoney Asiamoney గుర్తింపు.
- 2002లో "ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డు".
- 2005లో Time పత్రిక "ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతులైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా" ఆయనను గుర్తించింది.
- మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించేందుకు అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శించి, తాను ఒక నిపుణుడిగా, మార్గదర్శిగా చరిత్రలో నిలిచారు.