జేడీఎస్, కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డినప్పటికీ మండ్య నుంచి సినీ నటి సుమలత స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె బీజేపీలోకి వెళుతున్నట్లు వార్తలు రావడంతో సుమలత స్పందించారు.

తాను స్వతంత్ర ఎంపీగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బీజేపీలో చేరే ఆలోచన లేదని.. లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌తో చేతులు కలపకుండా కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగివుంటే మరిన్ని లోక్‌సభ స్థానాల్లో విజయం లభించి వుండేదని సుమలత అభిప్రాయపడ్డారు.

జేడీఎస్‌తో పొత్తు అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసిందని.. తనకు తెలిసినంతలో హస్తం 10 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని వుండేదన్నారు. రాష్ట్రంలో ప్రజాబలంతో గెలిచిందని భావించడం లేదని సుమలత అభిప్రాయపడ్డారు.