మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను ఉరి తీయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. జరిగిన దారుణం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిన్నారి తల్లిదండ్రుల చెవిలో ఓ పిడుగులాంటి వార్త పడింది. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వారిద్దరికి హెచ్ఐవీ పరీక్షలు చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ వార్త విని తమ కూతురి జీవితం ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కాగా స్కూలు నుంచి బయటకు వచ్చి తన తండ్రి కోసం ఎదురు చూస్తున్న చిన్నారిని ఆసీఫ్, ఇర్ఫాన్ అనే ఇద్దరు యువకులు అపహరించుకుపోయారు. నిర్మానుష్య ప్రాంతంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.

అక్కడితో ఆగకుండా ఆమె మర్మావయవాల్లోకి ఐరన్ రాడ్‌ను చొప్పించి.. అదే పనిగా తిప్పడంతో పొత్తికడుపులోని పేగులు బయటకు వచ్చాయి.. ఆస్పత్రిలో బాలిక స్థితి చూసి వైద్యుల చేతులే వణికాయంటే ఆ కామాంధులు ఏ స్థాయిలో చిన్నారికి నరకం చూపారో అర్ధం చేసుకోవచ్చు. వీరిద్దరిని కఠినంగా శిక్షించాలని మంద్‌సౌర్‌ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనే వదలిపెట్టబోమని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు.