లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న మహిళను తుపాకితో బెదిరించి ఆమె మరిదితో పాటు అతని స్నేహితుడు అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో గురువారం రాత్రి ఆ సంఘటన జరిగింది. దానిపై బాధిత మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..... మీరట్ జిల్లాలో నివసిస్తున్న బాధిత మహిళ భర్త తాగుబోతు. కొంత కాలం క్రితం భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. ఎప్పటి నుంచో ఆమెపై మరిది కన్నేశాడు. 

గురువారం రాత్రి బాధితురాలు ఒంటరిగా ఉండడం గమనించి తనతో పాటు మరో యువకుడిని వెంట తీసుకుని ఇంటి గోడ దూకి వెళ్లాడు. వారిని చూసి మహిళ కేకలు వేసింది. అయితే వాళ్లు తమతో పాటు తెచ్చుకుని తుపాకితో ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. 

విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శుక్రవారంనాడు బాధిత మహిళ మీరట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహిళ మరిదిని, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.