అతను దాదాపు నాలుగేళ్లుగా ఓ యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అయితే.. వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. పైగా సదరు యువకుడికి బలవంతంగా వేరే యువతితో పెళ్లి జరిపించారు. దీంతో.. ప్రేమించిన యువతిని కాదని.. వేరే అమ్మాయితో జీవితం పంచుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే భార్యకు దూరంగా ఉంటూ వచ్చాడు. కాగా.. తాజాగా.. తాను ప్రేమించిన యువతికి నడిరోడ్డుపై తాళి కట్టాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం దావణగెరె సమీపంలోని తిమ్లాపుర గ్రామంలో హేమంత్‌ అనే యువకుడు నాలుగేళ్లుగా తాను ప్రేమిస్తున్న యువతికి ఆదివారం నడిరోడ్డుపైనే తాళి కట్టేశాడు. కాగా.. హేమంత్‌కు ఇటీవల వివాహం జరిగింది. అయితే ఆ పెళ్లి నచ్చని అతడు కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. ఆదివారం అందరూ చూస్తుండగానే తాను ప్రేమించిన యువతి మెడలో తాళి కట్టేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు