కన్నకూతురిపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఆరేళ్ల పసిబిడ్డ అన్న కనికరం కూడా లేకుండా.. వికృతంగా ప్రవర్తించాడు. కాగా.. అతనికి న్యాయస్థానం జీవితఖైదు శిక్ష విధించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని కత్ని జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కత్ని జిల్లాకుచెందిన వ్యక్తి(32) కి భార్య, ముగ్గురు సంతానం. కాగా.. అతని భార్య  కొద్ది సంవత్సరాలుగా పక్షపాతంతో బాధపడుతోంది. దీంతో.. ఆమె తన ముగ్గురు బిడ్డలను తీసుకొని  జబల్‌పూర్‌లోని తన సోదరి వద్ద ఉంటోంది. అతను మాత్రం అప్పుడప్పుడూ జబల్‌పూర్ వచ్చి వెళ్తుండే వాడు. అయితే నవంబర్ 5, 2016న ఆరేళ్ల కూతరిని తీసుకుని కత్ని జిల్లాలోని ఘుహారి గ్రామానికి వెళ్లాడు. నవంబర్ 20 వరకు కూతురు తండ్రితోనే ఉంది.

తన దగ్గర ఉంచుకున్న అన్ని రోజులు.. బాలికపై అత్యాచారినికి పాల్పడ్డాడు. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గరకు రాగానే  బాలిక  జరిగిన విషయం చెప్పింది. దీంతో పోలీసులను సంప్రదించారు. విచారణ అనంతరం నింధితుడికి జీవితఖైదు విధిస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది.

లైంగిక నేరాల నుంచి చిన్నారుల రక్షణ నిమిత్తం రూపుదిద్దుకున్న పోక్సో చట్టం ప్రకారం నింధితుడిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారని, అనంతరం నింధితుడికి శిక్ష విధించామని స్పెషల్ జడ్జి ఆర్.పి.సోని తెలిపారు.
 
నింధితుడిని (32) కత్ని జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్మ్రితిలతా బర్కడే తెలిపారు. జైలు శిక్షతో పాటు నింధితుడికి రూ.10,000 జరిమానా విధించారు. ఇందులో రూ.8,000 బాధితురాలికి పరిహారంగా ఇవ్వనున్నారు.