Asianet News TeluguAsianet News Telugu

రేప్ కేసు నిందితుడు రింకు:ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ కి జైలులో మసాజ్

తీహర్  జైలులో  మంత్రి  సత్యేంద్రజైన్ కు  మసాజ్  చేసిన  వ్యక్తి  ఫిజియోథెరపిస్టు  కాదని  జైలు  అధికారులు  తేల్చారు.  రేప్ కేసులో  శిక్షను  అనుభవిస్తున్న  వ్యక్తి  మంత్రికి  మసాజ్  చేశారని  గుర్తించారు.

Man Seen Giving Massage To Jailed Delhi Minister   Satyendar Jain A Rape-Accused
Author
First Published Nov 22, 2022, 10:36 AM IST

న్యూఢిల్లీ: ఢిల్లీ  మంత్రి  సత్యేంద్రజైన్  కు  మసాజ్  చేసిన  వ్యక్తి  ఫిజియోథరపిస్ట్  కాదని జైలు  వర్గాలు  చెబుతున్నాయి.  అంతేకాదు  మంత్రికి  మసాజ్  చేసింది  ఇదే  జైలులో  శిక్ష  అనుభవిస్తున్న  ఖైదీగా  చెబుతున్నారు.  అత్యాచారం  కేసులో  రింకూ  అనే  వ్యక్తి  ఈ  జైలులో  శిక్ష అనుభవిస్తున్నాడు.

ఫోక్సో  చట్టం  కింద  జైలుకు  వచ్చిన  రింకు  మంత్రి సత్యేంద్రజైన్ కు  మసాజ్  చేశారు. తీహర్  జైలులో ఈ  ఏడాది  సెప్టెంబర్ 13, 14, 21  తేదీల్లో  ఈ  వీడియోలు రికార్డయ్యాయి. ఇటీవలనే  ఈ  వీడియోలు  బహిర్గతమయ్యాయి.ఈ  వీడియోలపై  ఆప్, బీజేపీల  మధ్య  మాటల  యుద్ధం  సాగుతుంది. వచ్చే  నెలలో  ఢిల్లీలో మున్సిపల్  ఎన్నికలు  జరగనున్నాయి.  ఈ  తరుణంలో ఈ  వీడియోలు  బయటకు  రావడం  రాజకీయంగా  ప్రాధాన్యత  సంతరించుకుంది.  రింకు  ఫిజియోథెరపిస్ట్  కాదని  తీహర్  జైలు  వర్గాలు  చెబుతున్నాయని  జాతీయ  మీడియా కథనాలను  ప్రసారం  చేసింది. 

ఇదిలా  ఉంటే మంత్రి సత్యేంద్రజైన్ కు  మసాజ్  చేసిన  వ్యక్తి  ఫిజియోథెరపిస్ట్  అంటూ  ఆప్  తెలిపింది.  అయితే సత్యేంద్రజైన్ కు  మసాజ్  చేసింది  పిజియోథెరపిస్టు  కాదని  జైలు  అధికారులు  చెప్పడంతో ఆప్ పై  బీజేపీ  విమర్శలు  గుప్పిస్తుంది.  ఖైదీని  ఫిజియోథెరపిస్టుగా  ప్రచారం  చేసిన  ఆప్  నేతలు  ఫిజియోథెరపిస్టులకు  క్షమాపణలు  చెప్పాలని  బీజేపీ  డిమాండ్  చేసింది. బీజేపీ  అధికార  ప్రతినిధి  షెహజాద్ పూనావాల  ట్విట్టర్  వేదికగా  ఈ  విమర్శలు  చేశారు. తీహర్  జైలులో  మంత్రి  సత్యేంద్రజైన్ కు  వీఐపీ  ట్రీట్ మెంట్  ఇస్తున్నారని  బీజేపీ  విమర్శలు గుప్పించింది.  సత్యేంద్రజైన్ కు  మసాజ్  చేస్తున్న  వీడియోను  బీజేపీ  చూపింది.  అయితే  ఈ  విమర్శలకు  ఆప్  తోసిపుచ్చింది.  సత్యేంద్రజైన్ కు  ఫిజియోథెరపిస్టు చికిత్స  అందిస్తున్నట్టుగా ఆప్  వివరణ  ఇచ్చింది.  అయితే  ఆప్  చెబుతున్నట్టుగా  సత్యేంద్ర  జైన్ కు  మసాజ్  చేసిన  వ్యక్తి ఫిజియోథెరపిస్టు  కాదని  జైలు  అధికారులు  తేల్చి  చెప్పారు. దీంతో  మరోసారి  ఆప్  ఆత్మరక్షణలో  పడింది. ఈ  విషయమై  బీజేపీ  ఆప్ పై  తన  విమర్శల దాడిని  మరింత  పెంచింది.

Follow Us:
Download App:
  • android
  • ios