జైపూర్: రాజస్థాన్ లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన మరదలిపై అత్యాచారం చేశాడు. దాంతో మైనర్ ఆయిన ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ తర్వాత ఆమెతో పాటు మహారాష్ట్రలోని పూణేకు పారిపోయాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను పూణేకు తీసుకుని వెళ్లాడు. ఈ సంఘటన బర్మేర్ లోని జిడా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా బాలిక పూణేలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెను పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు మాత్రం పారిపోయాడు. 

పోలీసులు బాలికను బర్మేర్ కు తీసుకుని వచ్చారు. బాలిక గర్భం దాల్చినట్లు ఆ సమయంలో కుటుంబ సభ్యులకు తెలిసింది. దాంతో వారు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. నిందితుడు నిర్బంధించి ఆమెపై పలు మార్లు అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.