కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రే.. కామంతో కళ్లు మూసుకుపోయి కన్న బిడ్డ జీవితాన్ని నాశనం చేయబోగా...అడ్డుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే... ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కుమారి గ్రామానికి చెందిన బిజయ బెహరాకు భార్య, కూతురు ఉన్నారు.

గత కొన్నేళ్లుగా కూతురిపై కన్నేసిన బిజియ ఆమెను ఎలాగైనా అనుభవించాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో గత నెల 2 వ తేది అర్ధరాత్రి వేరే వ్యక్తి సాయంతో ఆమెను దగ్గరలోని కొండ ప్రాంతానికి అపహరించుకుని తీసుకుపోయాడు.

దీనిని గమనించిన ఆయన భార్య  వారిని వెంబడించింది. కొండ మీదకు చేరుకున్న తర్వాత బెహరాతో పాటు వచ్చిన వ్యక్తి వెళ్లిపోయాడు. ఆ వెంటనే బిజియా.. తన కుమార్తపై అత్యాచారం చేయబోయాడు.

అది చూసిన భార్య అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయబోయింది. కామంతో కళ్లు మూసుకుపోయి ఆవేశంతో ఊగిపోయిన అతను.. భార్యను చితకబాదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

అనంతరం ఆ నీచుడు తన కూతురిని అనుభవించాడు. లైంగిక చర్యకు సహకరించడం లేదన్న కోపంతో ఆమెను దారుణంగా కొట్టి పారిపోయాడు. బాధితుల అరుపులు విన్న కొందరు స్థానికులు కొండపైకి వెళ్లి చూసేసరికి మహిళ చనిపోయి ఉండగా.. బాలిక ప్రాణాపాయ స్థితిలో పడివుంది.

దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సమాచారంతో తండ్రిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు కేరళకు పారిపోయినట్లు సమాచారం. అక్కడి పోలీసుల సాయంతో కామాంధుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.