నీటి కోసం జరిగిన గొడవలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అక్రమంగా నీటిని దొంగతనం చేస్తున్న ఓ వ్యక్తిని నిలదీసినందుకు కుటుంబం మొత్తం కలిసి ఓ వ్యక్తిని  అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ  సంఘటన తంజావూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...తంజావూరులోని విలార్ సౌత్ కాలనీకి చెందిన ఆనంద్ బాబు ఓ సామాజిక కార్యకర్త. ఇటీవల అతను ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా... కుమార్(48) అనే వ్యక్తి  పబ్లిక్ నీటి కులాయి నుంచి అక్రమంగా నీటిని తరలిస్తున్నాడు. పెద్ద పెద్ద ప్లాస్టిక్ బ్యారెల్స్ ని పబ్లిక్ టాప్ నుంచి వాటర్ తో నింపుతున్నాడు. దానిని గమనించిన ఆనంద్ బాబు.. పబ్లిక్ వాటర్ ని ఇలా అక్రమంగా తరలించడం నేరమని అతనిని అడ్డుకున్నాడు.

తమను అడ్డుకున్నాడనే కోపంతో.. కుమార్, అతని కుమారులు మరో ముగ్గురు కలిసి ఆనంద్ బాబుపై దాడికి పాల్పడ్డాడు. పదునైన వస్తువులతో దాడి చేసి చంపారు. దీనిని గమనించిన ఆనంద్ బాబు తండ్రి ధర్మరాజు కొడుకును కాపాడుకునేందుకు అక్కడికి వచ్చారు. అయితే... అతనిపై కూడా వాళ్లు దాడి చేయడం గమనార్హం.

ధర్మరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.