ముంబై: మహారాష్ట్రలోని ముంబై దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భార్యను బూతులు తిట్టాడనే కోపంతో ఓ వ్యక్తి తన మిత్రుడిని హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా నరికి మురుగు కాలువలో పడేశాడు. 

పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. సుశీల్ కుమార్ సర్ నాయక్ అనే బ్యాంక్ ఉద్యోగి ముంబైలోని వొర్లి పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. గత శనివారం మిత్రుడిని కలవడానికి విరార్ కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

దాంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం నేరల్ రైల్వే స్టేశన్ దగ్గరలో మురికి కాలువలో పడి ఉన్న ఓ బ్యాగులో మనిషి శరీరావయవాలు ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు అక్కడికి వెళ్లి వాటిని స్వాధీనం చేసుకున్నారు. 

ఆ తర్వాత సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. దాంతో నాడార్ అనే వ్యక్తి బ్యాగులను మోసుకుని వెళ్తున్నట్లు కనిపించాడు. దాంతో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను తన నేరాన్ని అంగీకరించాడు.

శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి సుశీల్ విరార్ కు కాకుండా నేరల్ లోని మిత్రుడు చార్లెస్ నాడార్ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇరువురు కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో నాడార్ సుశీల్ భార్యను బూతులు తిట్టాడు. దాంతో కోపాన్ని నిలువరించుకోలేక సుశీల్ నాడార్ ను చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పది ముక్కలు చేసి రైల్వే స్టేషన్ సమీపంలోని మురికి కాలువలో పడేశాడు.